మేఘ ఆకాష్ కొత్త సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన తన తల్లి బిందు ఆకాష్!!

‘డియర్ మేఘ’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత మేఘ ఆకాష్ మరో మంచి లవ్ స్టొరీ సైన్ చేసింది.ఈ చిత్రానికి డియర్ మేఘ దర్శకుడు సుశాంత్ రెడ్డి కథ అందించడం విశేషం.

 Megha Akash Mother Turns Producer For Her Next Movie Details, Megha Akash, Mothe-TeluguStop.com

అంతేకాదు నిర్మాణం లో కూడా ఆయన పాలు పంచుకుంటున్నారు.

సుశాంత్ రెడ్డి ఏ & అభిషేక్ కోట నిర్మాణంలో, మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది.

మేఘ ఆకాష్ హీరొయిన్ గా రూపొందబోతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అసోసియేట్ అభిమన్యు బడ్డి దర్శకుడు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, “డియర్ మేఘ లాంటి హిట్ చిత్రం తరువాత మేఘ ఆకాష్ తో మా కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం పై చాలా అంచనాలున్నాయి.

దర్శకుడు అభిమన్యు బడ్డి పై మాకు చాలా నమ్మకముంది.ముఖ్య నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నాం.షూటింగ్ కూడా అతి త్వరలో మొదలవుతుంది.” అన్నారు

కథ : ఏ.సుశాంత్ రెడ్డి, సంగీతం: హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, దర్శకత్వం: అభిమన్యు బడ్డి, పి.ఆర్.ఓ : జిఎస్ కె మీడియా, కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ, కో-ప్రొడ్యూసర్: అభిషేక్ కోట, నిర్మాత: ఏ.సుశాంత్ రెడ్డి & అభిషేక్ కోట, సమర్పణ: బిందు ఆకాష్, నిర్మాణ సంస్థ: కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube