ఈ తరం స్టార్ హీరోలలో కొంతమంది స్టార్ హీరోలు వెండితెరపై సక్సెస్ సాధించినా బుల్లితెరపై, ఓటీటీలలో సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అయ్యారు.అయితే బాలయ్య మాత్రం అన్ స్టాపబుల్ టాక్ షోతో ఓటీటీలో కూడా సత్తా చాటారు.
ఆహా ఓటీటీకి ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్లు పెరగడానికి బాలయ్య షో కారణమని చాలామంది భావిస్తారు.ఈ టాక్ షో ఐఎండీబీ రేటింగ్ విషయంలో, వ్యూస్ విషయంలో నయా రికార్డులను క్రియేట్ చేసింది.
అన్ స్టాపబుల్ షో బాలయ్య క్రేజ్ ను కూడా పెంచింది.ఈ షో సీజన్2 ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేకపోయినా సీజన్2 కొరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ షో ద్వారా బాలయ్య సెలబ్రిటీలకు సంబంధించిన సీక్రెట్లు ప్రేక్షకులకు తెలిసేలా చేయడంతో పాటు సెలబ్రిటీల ద్వారానే వాళ్లకు సంబంధించిన వివాదాల గురించి ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేలా చేస్తుండటం గమనార్హం.
ఆహా నిర్వాహకులు బాలయ్యతో నెవర్ హావ్ ఐ ఎవర్ అనే కాన్సెప్ట్ తీసుకుని బాలయ్యను కొన్ని ప్రశ్నలు అడిగారు.
బాలయ్య తాను కాలేజ్ కు బంక్ కొట్టానని అసలు ఎవరు బంక్ చేయరని ప్రశ్నించారు.
నేను కాలేజ్ కు బంక్ కొట్టేవాడినని నాన్నకు తెలియదని బాలయ్య తెలిపారు.కరోనా వచ్చిన సమయంలో లెజెండ్ సినిమా గురించి వైరల్ అయిన మీమ్ తనకు చాలా నచ్చిందని బాలయ్య చెప్పుకొచ్చారు.
తనను తాతయ్య అని ఎవరైనా పిలిస్తే నచ్చదని బాలయ్య తెలిపారు.
వాళ్లు నన్ను బాలా అని పిలవాలని నో తాతా నో గ్రాండ్ పా అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు.బాలయ్య చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్య యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకుల్లో క్రేజ్ ను పెంచుకుంటున్నారు.బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.