స్పృహ తప్పి పడిపోయిన వైసీపీ ఎంపీ ..!!

ప్రస్తుతం పార్లమెంటు మరియు రాజ్య సభ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ స్పృహతప్పి పడి పోవడం జరిగింది.

 Ysrcp Mp Pilli Subhash Chandra Boseadmitted In Hospital, Mp Pilli Subhash Chand-TeluguStop.com

బీపీ మరియు షుగర్ ఒక్కసారిగా డౌన్ అయిపోవడంతో.పార్లమెంటు ప్రాంగణంలోనే కళ్ళు తిరిగి పడిపోయారు.

ఇక అదే సమయంలో అక్కడ చాలా మంది ఉండటంతో… ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.వెంటనే మిగతా ఎంపీలు స్ట్రచర్ తీసుకొచ్చి… ఢిల్లీలోని ఆర్.

ఏమ్.ఎల్ హాస్పిటల్ కి తరలించారు.

అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని అంతా బాగానే ఉందని వైద్య వర్గాలు తెలియజేశాయి.పని ఒత్తిడి కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో తెలుగు పార్లమెంటు సభ్యులు. విషయం తెలుసుకుని ఆసుపత్రి వద్దకు వెళ్లడం జరిగింది.

విషయం హైదరాబాదులో ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియడంతో వెంటనే.సుభాష్ చంద్రబోస్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అంటే ఎటువంటి ప్రమాదం లేదని.వైద్యులు తెలపడంతో వైసిపి ఎంపీలు ఊపిరిపీల్చుకున్నారు.

అందరూ చూస్తుండగానే సభా ప్రాంగణంలో అకస్మాత్తుగా పడిపోవడంతో ఒక్కసారిగా మిగతా రాజ్యసభ సభ్యులు కంగారు పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube