స్పృహ తప్పి పడిపోయిన వైసీపీ ఎంపీ ..!!
TeluguStop.com
ప్రస్తుతం పార్లమెంటు మరియు రాజ్య సభ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ స్పృహతప్పి పడి పోవడం జరిగింది.
బీపీ మరియు షుగర్ ఒక్కసారిగా డౌన్ అయిపోవడంతో.పార్లమెంటు ప్రాంగణంలోనే కళ్ళు తిరిగి పడిపోయారు.
ఇక అదే సమయంలో అక్కడ చాలా మంది ఉండటంతో.ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
వెంటనే మిగతా ఎంపీలు స్ట్రచర్ తీసుకొచ్చి.ఢిల్లీలోని ఆర్.
ఏమ్.ఎల్ హాస్పిటల్ కి తరలించారు.
అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని అంతా బాగానే ఉందని వైద్య వర్గాలు తెలియజేశాయి.
పని ఒత్తిడి కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.ఇక ఇదే సమయంలో తెలుగు పార్లమెంటు సభ్యులు.
విషయం తెలుసుకుని ఆసుపత్రి వద్దకు వెళ్లడం జరిగింది.విషయం హైదరాబాదులో ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియడంతో వెంటనే.
సుభాష్ చంద్రబోస్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అంటే ఎటువంటి ప్రమాదం లేదని.
వైద్యులు తెలపడంతో వైసిపి ఎంపీలు ఊపిరిపీల్చుకున్నారు.అందరూ చూస్తుండగానే సభా ప్రాంగణంలో అకస్మాత్తుగా పడిపోవడంతో ఒక్కసారిగా మిగతా రాజ్యసభ సభ్యులు కంగారు పడ్డారు.
మైక్ టైసన్‌ను భుజాలపై ఎత్తుకున్న వ్యక్తి.. తర్వాతేమైందో మీరే చూడండి..?