సినిమా రంగంలో సక్సెస్ సాధిస్తే వచ్చే డబ్బులతో పోలిస్తే సినిమా ఫ్లాప్ అయితే పోగొట్టుకునే డబ్బులు ఎక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే.సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలను నిర్మించి తర్వాత రోజుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు.
ప్రముఖ రచయిత, దర్శకుడు అయిన భారవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీరామదాసు సినిమాలకు రచయితగా పని చేసిన భారవి రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకొని రాఘవేంద్రరావు సినిమాలకు ఎక్కువగా పని చేశారు.
తెలుగుతో పాటు కన్నడ సినిమాలకు భారవి పని చేశారు.ఇంటర్వ్యూకు ఓలా బైక్ పై వచ్చిన భారవి తాను అన్ని కార్లను చూశానని ఊహించని స్థాయిలో వైభవాన్ని చూశానని చెప్పుకొచ్చారు.
కన్నడలో నేను ఇచ్చిన స్థాయిలో ఎవరూ హిట్లను ఇవ్వలేదని భారవి తెలిపారు.
తెలుగు, తమిళ భాషలలో తాను చెప్పిన కథలు కొన్ని ఓకే అయ్యానని అయితే కరోనా వల్ల డబ్బులు రిలీజ్ కావడం లేదని భారవి చెప్పుకొచ్చారు.
సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బులను సినిమాల్లోనే పోగొట్టుకున్నానని భారవి పేర్కొన్నారు. జగద్గురు ఆదిశంకర సినిమాతో తాను సంపాదించిన డబ్బులు పోయాయని భారవి చెప్పుకొచ్చారు.
సినిమాలో ఆయన భిక్ష పాత్రను పట్టుకుంటే నిజ జీవితంలో నాకు అలాంటి పరిస్థితి కలిగిందని భారవి వెల్లడించారు.
రాఘవేంద్ర రావుగారు నన్ను కవిగారు అని పిలుస్తారని కె రాఘవేంద్రరావు వెల్లడించారు.నాకు ఏసీ అంటే పడదని నేను ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటనే ఏసీ ఆఫ్ చేసేవారని రాఘవేంద్రరావు అన్నారు.సినిమా రంగం ద్వారా ఎంతో సంపాదించిన భారవి సినిమాల ద్వారానే సంపాదించిన డబ్బులను పోగొట్టుకోవడం గమనార్హం.
జెకె భారవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.