మొన్న రాపిడో వివాదం.. నేడు జోమాటో వివాదం.. పుష్ప రాజ్ కు యాడ్ సెట్ అవ్వట్లేదా?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్ లు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడం మనం చూస్తున్నాము.ఈ విధంగా ఎంతో మంది ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు.

 Rapido Controversy Today Zomato Controversy Is That Allu Arjun Not Set Ads , Al-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది హీరో హీరోయిన్లు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.ఇక తాజాగా పుష్ప సినిమా ద్వారా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ సైతం ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అల్లుఅర్జున్ ఇప్పటివరకు ఎన్నో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

ఇక పుష్ప పాన్ ఇండియా చిత్రం ద్వారా ఉత్తరాది రాష్ట్రాలలో ప్రేక్షకులను సందడి చేసిన ఈయన ప్రముఖ ఫుడ్ సంస్థ అయిన జొమాటోకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈక్రమంలోనే జొమాటో కోసం అల్లు అర్జున్ ఒక యాడ్ షూట్ చేశారు.ఈ యాడ్ లో భాగంగా అల్లు అర్జున్ నటుడు సుబ్బరాజుతో ఫైట్ చేస్తూ తనని కొడతాడు.

దీంతో సుబ్బరాజు గాల్లో తేలుతాడు.ఇక గాల్లో తేలుతున్న సుబ్బరాజు బన్నీ నన్ను తొందరగా కిందకి దించూ… నేను గోంగూర మటన్ తినాలి లేదంటే హోటల్ మూసేస్తారు అంటూ తనని అడుగుతారు.

ఇది సౌత్ సినిమా కదా గాల్లో ఎక్కువసేపు ఎగరాలి అంటూనే.ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా అంటూ బన్నీ చెప్తాడు.‘ఏం కావాలన్నా.ఎప్పుడు కావాలన్నా జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా.

మనసు కోరితే తగ్గేదేలే’ అంటూ పుష్ప స్టైల్లో బన్నీ డైలాగ్ చెబుతారు.

ఈ విధంగా జోమాటో గురించి ఈయన చెప్పే స్టైల్ ఇందులో ఇతని లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై ప్రశంసలు కురిపించగా, చాలామంది అల్లు అర్జున్ వీడియో పై విమర్శలు చేస్తున్నారు.గతంలో ఈయన చేసిన రాపిడో బైక్ లను పొగుడుతూ ఆర్టీసీని కించపరుస్తూ చేసిన ఈ వీడియో కూడా తీవ్ర వివాదానికి దారి తీసింది.

ఇక ఈ వివాదం పై తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇది కాస్త వివాదంలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Allu Arjun, Ambassador, Controversy, Puspa, Rapido, Rapido Bike, Subbaraj

అయితే నేడు అల్లు అర్జున్ నటించిన జొమాటో యాడ్ కూడా మరొక వివాదానికి తెర లేపుతుంది.అల్లు అర్జున్ సౌత్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఈ యాడ్ లో సౌత్ సినిమాలు కదా గాల్లో ఎగరాలి  అంటూ సౌత్ సినిమాలను కించ పరిచినట్టుగా మాట్లాడారు అంటూ పెద్ద ఎత్తున పలువురు ఈ వీడియో పై విమర్శలు చేస్తున్నారు.ఇలా బన్నీ నటించిన రెండు అతిపెద్ద యాడ్స్ కూడా ఈ విధంగా వివాదానికి కారణం కావడంతో పుష్పరాజ్ కు యాడ్స్ పెద్ద గా సెట్ అవ్వడం లేదా….

అందుకే ఈ విధమైనటువంటి వివాదాలకు దారి తీస్తున్నాయా అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube