టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.‘గంగోత్రి’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ మెగా మేనల్లుడు.ఆ పై ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇటీవలే విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు.
ఇక అల్లు అర్జున్ నటుడుగానే కాకుండా డాన్సర్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.చాలా వరకు ఆయన అభిమానులు ఆయన డాన్స్ కోసం కూడా సినిమాలు చూస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్ గా కూడా చేసాడట.అదేంటి అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్ గా చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారా.
మీరు విన్నది నిజమే.అల్లు అర్జున్ నిజంగానే కొరియోగ్రాఫర్ గా చేసాడట.అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాలోనే చేసాడట.ఇంతకు ఆ సినిమా ఏదో కాదు గుడుంబా శంకర్.2004లో వీర శంకర్ దర్శకత్వం లో గుడుంబా శంకర్ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.అందులో పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ నటి నటులుగా నటించారు.

ఇక ఈ సినిమాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్ర బోస్, మాస్టర్ జీ పాటలు అందించారు.ఇక ఈ సినిమాకు నాగబాబు నిర్మాతగా చేశాడు.ఇందులో చిలకమ్మా అనే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా అల్లు అర్జున్ బాధ్యతలు చేపట్టాడట.ఈ విషయం చాలా వరకు ఎవరికి తెలియక పోగా.
ప్రస్తుతం నెటిజన్లకు తెలియటంతో షాక్ అవుతున్నారు.
ఇక నెటిజన్లు, అల్లు అర్జున్ అభిమానులు తెగ కామెంట్స్ కూడా పెడుతున్నారు.అల్లు అర్జున్ ఏకంగా తన మేనమామ పాటకే కొరియోగ్రాఫర్ గా చేశాడు అంటే మెగా అభిమానులు కూడా పొంగిపోతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెలుగు రాష్ట్రలలో ప్రేక్షకులు చూపించే అభిమానం అంతా ఇంతా కాదు.

ఎందుకంటే ఆయనకున్న అభిమానం కూడా అటువంటిదే కాబట్టి.పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా అయినా కొత్తదనం ఉంటుంది.నిజానికి ఆయన ఎంచుకునే కథలే అలా ఉంటాయి.
కొత్త దర్శకులైనా సరే కథ నచ్చితే వెంటనే ఒప్పేసుకుంటాడు.
అలా గతంలో తాను నటించిన గుడుంబా శంకర్ సినిమాలో తన పాటకు కొరియోగ్రాఫర్ గా అల్లు అర్జున్ కు బాధ్యతలు ఇచ్చాడు.
ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ వేరే సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేసాడో లేదో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ విషయంతో అల్లు అభిమానులు తెగ పొంగిపోతున్నారని అర్ధమవుతుంది.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.