సినీ సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.కాగా ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి అంటే వైరల్ గా మారిపోతూ ఉంటాయి.
ముఖ్యంగా వారు ధరించే డ్రెస్సులు వాచ్ లు లాంటి వాటి పైనే అందరి దృష్టి ఉంటుంది.కొన్నిసార్లు ఇక ఇలాంటి వాటిపై తీవ్రమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది కూడా.
ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే పర్స్ గురించిన చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది.ఒకవైపు సినిమాలతో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే పూజా హెగ్డే అటు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటో షూట్లతో అందర్నీ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.కోలీవుడ్లో కూడా సత్తా చాటుతోంది.
అదే సమయంలో బాలీవుడ్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది పూజా హెగ్డే. ఇక వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని అంతకంతకు రెమ్యునరేషన్ పెంచేస్తోంది ఈ హాట్ బ్యూటీ.
ఇకపోతే ఇటీవలే పూజా హెగ్డే కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఈ ఫోటోలో రెడ్ కలర్ టాప్ స్కిన్ టైట్ లెగ్గిన్ ధరించి ఎంతో స్టైల్ గా కనిపిస్తుంది.
ఈ క్రమంలోనే చేతిలో యాపిల్ ఫోన్ తో పాటు బుల్లి పర్స్ ఉంది.
ఇక అంతా బాగానే ఉంది కానీ పూజా హెగ్డే చేతిలో ఉన్న చిన్న పర్సులో అసలు ఏముంది అన్న చర్చ మాత్రం ఇప్పుడు మొదలైంది.పూజా హెగ్డే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టిందో లేదో ఇది చూసి మీ పర్సులో ఏముంది మేడం అంటూ నెటిజన్లు కామెంట్ చేయడం మొదలుపెట్టారు.కానీ పూజా హెగ్డే నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదు అని చెప్పాలి.
ఇంకేముంది దీని గురించి అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు.దీంతో ఈ బుట్ట బొమ్మ బుల్లి పర్సులో ఏముంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.ఇకపోతే ఈ అమ్మడు రాధేశ్యామ్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ సినిమా వాయిదా పడింది అన్న విషయం తెలిసిందే.వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసేందుకు సిద్ధమవుతోంది పూజా హెగ్డే.