ముహూర్తాలు లేవ‌ని 10ఏండ్లుగా కాపురానికి వెళ్లని భార్య.. భర్త ఏం చేశాడంటే..

ఇదో వింత కేసు.ఎవరైనా సరే తన భర్త, భార్య తనతో ఎప్పుడూ గొడవలు పడుతున్నారని తమకు విడాకులు మంజూరు చేయాలని కోర్టు మెట్లెక్కుతారు.

 The Wife Who Did Not Go To Kapura For 10 Years Without Any Moments What Did Th-TeluguStop.com

కానీ ఇక్కడ మాత్రం తన భార్య గత 10 సంత్సరాల నుంచి పుట్టింటి నుంచి తన వద్దకు రావడం లేదని తనకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరాడు.అతడి విడాకులను ఫ్యామిలీ కోర్టు రిజెక్ట్ చేయగా.

అతడు తన పంతం నెగ్గించుకునేందుకు హై కోర్టుకు వెళ్లాడు.ఫిర్యాదు దారుడి బాధలను విన్న హై కోర్టు అతడికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.

భార్య తన భర్తతో కాకుండా విడిగా జీవిస్తుంటే విడాకులు తీసుకునేందుకు భర్త అర్హుడేనని ప్రకటించింది.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.

రాయ్ గఢ్ లో ఉండున్న సంతోష్ సింగ్ కు మరియు బంజ్ గిరి వాస్తవ్యురాలైన అమితా సింగ్ తో 2010 జూలైలో పెళ్లైంది.కానీ పెళ్లైన 11 రోజులకు ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి అమితా సింగ్ ను ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకుపోయారు.

ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అమితా సింగ్ మెట్టినింటి గడప తొక్కలేదు.అమితా సింగ్ ఏదైనా గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయిందా? అంటే అదీ లేదు.

Telugu Devorce, Raigad-Latest News - Telugu

తను పుట్టింటి నుంచి మెట్టినింటికి రావడానికి సరైన ముహూర్తాలు లేవని ఈ 10 సంవత్సరాల నుంచి చెబుతూ వచ్చింది.దీంతో విసిగిపోయిన సంతోష్ సింగ్ రాయ్ గఢ్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేశాడు.కానీ ఆ ఫ్యామిలీ కోర్టు సంతోష్ సింగ్ విడాకుల కేసును కొట్టి పారేసింది.దీంతో ఎలాగైనా విడాకులు పొందాలని చూస్తున్న సంతోష్ సింగ్ ఛత్తీస్ గఢ్ హై కోర్టును ఆశ్రయించాడు.

తనకు విడాకులు కావాలని అర్జీ పెట్టుకున్నాడు.అతడి వాదనలు విన్న హైకోర్టు సంతోష్ సింగ్ కు విడాకులు మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube