కొత్త హీరోల సినిమాలు వచ్చినప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోరు.కాని ఆ సినిమా లకు స్టార్స్ ఎవరైనా ప్రమోషన్ చేయడం లేదా.
ఆ సినిమా ల గురించి మాట్లాడటం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా ల గురించి మీడియాలో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరగడం తద్వారా ఓపెనింగ్స్ రావడం జరుగుతుంది.ఏ సినిమా కు అయినా మినిమం ఓపెనింగ్స్ అనేది ఉండాలి.
అలా ఉన్నప్పుడు సినిమా బాగుంటే లాంగ్ రన్ లో సినిమాలకు మంచి వసూళ్లు నమోదు అవుతాయి.అందుకే ప్రతి చిన్న సినిమా కూడా పెద్ద ప్రమోషన్ ను కోరుకోవడం చాలా కామన్ అయ్యింది.
పెద్ద సినిమాలు మరియు చిన్న సినిమాలు అనే తేడా లేకుండా జనాలు టాక్ వచ్చిన తర్వాత చూస్తారు.కనుక ముందుగా సినిమాకు టాక్ వచ్చేలా బజ్ క్రియేట్ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.
ఇప్పడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి వస్తున్న గల్ల అశోక్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది.
ఈయన ‘హీరో‘ చిత్రం మొదలు అయ్యి మూడు నాలుగు ఏళ్లు అయ్యింది.కరోనా వల్ల ఆలస్యం అయ్యింది.సరే సంక్రాంతికి గ్యాప్ ఏర్పడటంతో హఠాత్తుగా సినిమాను దించేస్తున్నట్లుగా ప్రకటించారు.
బాగానే ఉంది.మంచి టైమ్ లో సినిమా ను తీసుకు వస్తున్నారు.
కాని ఈ సమయంలో సినిమాకు సంబంధించిన హడావుడి ఖచ్చితంగా అవసరం.కాని ఈ సమయంలో మహేష్ బాబు కరోనా బారిన పడటం తో ఆయన దూరంగా ఉంటున్నాడు.
సినిమా ప్రమోషన్ లో ఆయన ఖచ్చితంగా పాల్గొనేవాడు.ఈ వీకెండ్ లో జరగాల్సిన ప్రీ రిలీజ్ వేడుకలో ఖచ్చితంగా మహేష్ బాబు పాల్గొని తన అల్లుడిని పరిచయం చేసేవాడు.
కాని ఇప్పుడు అల్లుడి సినిమా ను ప్రమోట్ చేసేందుకు మహేష్ బాబుకు అవకాశం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహేష్ బాబు ‘హీరో’ సినిమా గురించి అల్లుడు గల్లా అశోక్ గురించి ఒక వీడియో బైట్ ను అయినా ఇస్తే బాగుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకు మహేష్ బాబు ఓకే చెప్తాడా అనేది చూడాలి.