బ్రిటన్ వెళ్లే భారతీయులకి శుభవార్త.. ఇక ‘‘ ప్రీ- ఆర్టీపీసీఆర్’’ అక్కర్లేదు

దక్షిణాఫ్రికాలో పుట్టిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే.ఒక్కొక్క దేశం దీని పడగ నీడ కిందకి వెళ్లిపోతుండగా.

 No Pre-departure Rt-pcr Test For Those Headed To Uk From January 7 , Rt-pcr Test-TeluguStop.com

మళ్లీ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి.అటు మనదేశంలోనూ కోవిడ్ ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది.

ఇవాళ కొత్త కేసుల సంఖ్య లక్ష దాటేసింది.కేవలం 10 రోజుల వ్యవధిలోనే 13 రెట్లు పెరిగిన కేసులు ప్రభుత్వాన్ని, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

పరిస్ధితి చూస్తుంటే నిపుణులు హెచ్చరించినట్లు భారత్‌లో థర్డ్‌వేవ్ తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అటు మనదేశంలో ఒమిక్రాన్ కూడా వేగంగా విస్తరిస్తోంది.ప్రస్తుతం ఆ కేసులు 3007కి చేరాయి.అత్యధికంగా మహారాష్ట్రలో 876 మంది ఒమిక్రాన్ బారినపడగా.తర్వాత ఢిల్లీలో 465 కేసులు వున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి.

ఆ మహమ్మారి తమ దేశంలోకి ఎక్కడ అడుగుపెడుతుందోనన్న భయంతో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.ముఖ్యంగా విమాన ప్రయాణీకులను ఒకటికి పదిసార్లు చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నాయి.

అంతకుమునుపే విమానం ఎక్కడానికి రెండురోజుల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ.అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యపడడం లేదు.

ఈ నేపథ్యంలో భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.బ్రిట‌న్ వ‌చ్చే వారు విమాన ప్ర‌యాణానికి ముందే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించ‌న‌వ‌స‌రం లేదని తెలిపింది.భార‌త్‌లో బ్రిట‌న్ హై క‌మిష‌న‌ర్ అలెక్స్ ఇల్లిస్ గురువారం ఈ మేరకు ట్వీట్ చేశారు.ప్రీ-ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ స‌ర్టిఫికెట్‌తోపాటు మరిన్ని ఆంక్షలను సైతం యూకే ప్రభుత్వం స‌ర‌ళ‌త‌రం చేసింది.

అయితే వ్యాక్సినేష‌న్ చేయించుకున్న యువ‌జ‌నులు, పిల్ల‌లు బ్రిటన్‌లో అడుగుపెట్టిన తర్వాత త‌ప్ప‌నిస‌రిగా టెస్ట్ చేయించుకోవాలి.ఈ క్రమంలో క‌రోనా పాజిటివ్‌గా వ‌స్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని యూకే ప్రభుత్వం వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube