బస్సు ప్రయాణం చేస్తుంటే ఆ ఆనందమే వేరు.చుట్టూ ఉన్న ప్రదేశాలను చూస్తూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపొచ్చు.
భారీ వస్తువులను సైతం బస్సులు భద్రంగా తీసుకెళ్లవచ్చు.ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.
అందుకే చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు.మిగిలిన ప్రైవేటు బస్సులతో పోలిస్తే ఆర్టిసీ బస్సుల్లో టికెట్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి.
అయితే ఆర్టీసీ బస్సులో ఎవరు ఎక్కినా టికెట్ తీసుకోవాలనేది నియమంగా ఉంది.మరి అటువంటి ఆర్టీసీ బస్సులో ఒక చిన్న కోడిపిల్లకు టికెట్ తీసుకున్నారు.
ఇటువంటి వింత ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.బస్సులో అందరూ ప్రయాణిస్తున్నారు.
ఓ కుటుంబం కూడా ఆ బస్సులో తమతో పాటుగా చిన్న కోడిపిల్లను కొని తీసుకెళ్తోంది.బస్సు కండక్టర్ ఆ చిన్న కోడిపిల్లకు కూడా టికెట్ కొట్టడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
కన్నడ జిల్లా సిద్ధపుర నుంచి ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మనుషులు ప్రయాణం చేస్తున్నారు.వారు ప్రయాణంలో వెళ్తూ వారి వెంట రూ.10ల కోడి పిల్లను తీసుకెళ్తున్నారు.ఆ కోడిపిల్లను వారు తీసుకుని హోసనగర నుంచి షిరూరుకు వెళ్తున్నారు.
డిసెంబరు 31వ తేదీన వారు బస్సులో వెళ్తుండగా హోసనగర వద్ద బస్సు ఎక్కిన వారు మూడు టికెట్లు కావాలని కండక్టర్ కు తెలిపారు.అదే టైంలో వారి సంచిలో నుంచి కోడిపిల్ల శబ్దం వినిపించింది.
ఆ బస్సు కండక్టర్ కోడి పిల్ల అరుపులను గమనించాడు.వెంటనే ఆ సంచిని పరిశీలించాడు.ఆ తర్వాత కోడిపిల్లకు కూడా టికెట్ కొనాలని కండక్టర్ చెప్పాడు.బస్సులో కోడిపిల్లకు టికెట్ కొనాలని నియమం ఉందని కండక్టర్ చెప్పడంతో చేసేదేం లేక ఆ కోడి పిల్లకు హాఫ్ టికెట్ ను వారు తీసుకున్నారు.రూ.10ల కోడి పిల్లను రూ.50లు పెట్టి టికెట్ తీసుకోవడంతో స్థానికులకు వింతగా అనిపించింది.అందరూ ముక్కుమీద వేలు వేసుకోవాల్సి వచ్చింది.