1.ఆఫ్ఘన్ కు భారత్ సాయం
ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ తన వంతు సహకారం అందించింది.కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతూ ఉండడం తో 5 లక్షల కోవిడ్ టీకా డోసులు అందించింది.
2.ఇజ్రాయిల్ లో మొట్టమొదటి ‘ ఫ్లోరోనా ‘ కేసు
కోవిడ్ 19, ఇన్ఫ్లుఎంజా యొక్క డబుల్ ఇన్ఫెక్షన్ అయిన ‘ ఫ్లోరోనా ‘ వ్యాధి మొదటి కేసు ఇజ్రాయిల్ లో నమోదయింది.
3.అణ్వస్త్ర వివరాలను పంచుకున్న భారత్ – పాక్
భారత్ పాకిస్తాన్ పరస్పరం దాడులు చేసుకోకూడదు అనే షరతులతో అణ్వస్త్ర వివరాలను రెండు దేశాలు పంచుకున్నాయి.
4.దద్దుర్లు, దురద ఉంటే ఒమిక్రాన్ లక్షణాలే
దద్దుర్లు దురద ఉంటే అవి ఒమి క్రాన్ లక్షణాలే అని లండన్ కింగ్స్ కాలేజీ, హెల్త్ సైన్స్ కంపెనీ జెడ్ వోఈ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో తేలింది.
5.కిమ్ మరో సంచలన నిర్ణయం
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.దేశంలో ప్రజలకు ఉపాధి కల్పించేలా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
6.రష్యా లో కరోనా తీవ్రతరం
రష్యాలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చింది.ఈ రోజు కొత్తగా 19,751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
7.పోప్ ఫ్రాన్సిస్ సందేశం
మహిళలను హింసించడం అంటే .దేవుడ్ని అవమనించినట్టే అని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ సందేశం వినిపించారు.
8.ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ ప్యాకింగ్ పై నిషేధం
ఫ్రాన్స్ లో పళ్లు, కూరగాయలు ప్లాస్టిక్ కవర్ లో ప్యాకింగ్ చేయడం పై నిషేధం విధించారు.
9.జైలు నుంచి విడుదలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గున్ హే ఐదేళ్ల తరువాత జైలు నుంచి విడుదల అయ్యారు.