భారత మాజీ పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాడు.రైఫిల్ చేతపట్టుకుని ‘‘పాన్ సింగ్ తోమర్’’ సినిమాలో హీరో ఇర్ఫాన్ ఖాన్ డైలాగ్ చెప్పి నెట్టింట్లో అలరించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. వీడియో బ్యాక్ గ్రౌండ్‌లో ‘అటాక్ హై గయో, పాన్ సింగ్ ఆయే గయో, భాగ్, భాగ్, భాగ్, ఓయి కిస్కా గ్యాంగ్ హై జే’.అనే డైలాగ్ ప్లే అవుతుంది.అనంతరం పీకే ఇర్ఫాన్ – యే పాన్ సింగ్ తోమర్ కా గ్యాంగ్ హై దరోగా జీ అంటూ డైలాగ్ పేల్చాడు ఈ మాజీ క్రికెటర్.
ఈ వీడియోను ఇప్పటివరకు 9,498 మంది లైక్ చేశారు.
మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఈ వీడియోని లైక్ చేశాడు.వీరిద్దరూ ఎప్పటి నుంచో మంచి స్నేహితులు.కాగా, ప్రవీణ్ కుమార్ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు.2011లో విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా ఓ బ్యాట్స్‌మెన్‌తో గొడవకు దిగి సస్పెండ్ కూడా అయ్యాడు.అలాగే ఆస్ట్రేలియా పర్యటనలోనూ అక్కడి ప్రేక్షకులతో ఘర్షణకు దిగాడు.2007లో ఇండియా తరపున క్రికెట్ ఆడిన ప్రవీణ్ కుమార్ 68 వన్డేలు, 6 టెస్టులు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పిచ్‌లపై బాగా రాణించాడు.
అతని కెరీర్‌ను ఓసారి చూస్తే… వన్డేల్లో 77 వికెట్లు, టెస్టుల్లో 27 వికెట్లు తీశాడు.ఇక టీ-20ల్లో కేవలం 10 వికెట్లు మాత్రమే తీశాడు. ప్రవీణ్ కుమార్ 2020లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు.డిప్రెషన్ లో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని.అయితే తన కుమారుల ఫొటో చూసి ఆ పని చేయలేక పోయానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రవీణ్ కుమార్. ఈ వీడియో మీద ఇప్పుడు చాలా రకాల కామెంట్లు వస్తున్నాయి.