తెలంగాణ బీజేపీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే సాధ్యమైనంత వరకు టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే వరుస ఉప ఎన్నికల విజయంతో బీజేపీ మరింత జోష్ గా ముందుకెళ్తోంది.బండి సంజయ్ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ ఒక్కసారిగా పుంజుకున్న సంగతి తెలిసిందే.
అయితే బీజేపీలో ఈటెల చేరిక తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయిన పరిస్థితి ఉంది.ఈటెల రాజేందర్ కేసీఆర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో హుజూరాబాద్ లో ఈటెల వర్సెస్ కేసీఆర్ గా ఎలాగైతే మారిపోయిందో రాష్ట్ర వ్యాప్తంగా అదే వాతావరణం కొనసాగించాలనే వ్యూహంతో పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే రానున్న రోజుల్లో ఈటెలకు బీజేపీలో ప్రత్యేక గుర్తింపు రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతవరకు అధికారికంగా ప్రకటించకున్నా ఈటెల వర్సెస్ టీఆర్ఎస్ లా ఉంటేనే బీజేపీ మరింత బలంగా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని బీజేపీ నేతల అభిప్రాయం.అయితే బీజేపీ నేత ఈటెల మాత్రం పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అందుకే ఈటెల ను మరింత ప్రోత్సహించి టీఆర్ఎస్ ను ఓటమిపాలు చేయాలనే లక్ష్యాన్ని సాధించాలని ముందుకు సాగుతోంది.
ప్రస్తుతం క్షేత్ర స్థాయి కార్యకర్తల నిర్మాణంపై దృష్టి పెట్టిన బీజేపీ రానున్న రోజుల్లో క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ ను బలంగా ఎదుర్కోవడంపై పూర్తిగా దృష్టి పెట్టిన తరుణంలో బీజేపీ వేస్తున్న ఒక్కో అడుగు రాజకీయ సంచలనాలకు దారి తీస్తున్న పరిస్థితి ఉంది.మరి ఈటెల వ్యూహం బీజేపీని విజయతీరాలకు చేరుస్తుందా లేదా అన్నది తెలియాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.