తెలుగులో ఊహించని స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని రకాల పాత్రలతో బన్నీ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.
పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.పుష్ప సినిమా ప్రభంజనం దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో కొనసాగుతోంది.
పుష్ప భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది.
ఈ సినిమాలో పుష్పరాజ్ తల్లి పాత్రలో కల్పలత నటించారు.
కల్పలత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప మూవీ గురించి, బన్నీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.బన్నీ షూటింగ్ కు వస్తే సెట్స్ లో తన పాత్ర గురించే ఎక్కువగా ఆలోచిస్తాడని ఆమె కామెంట్లు చేశారు.
బన్నీ తన పర్సనల్ విషయాలను సైతం పక్కన పెట్టి పాత్రలో లీనమైపోతాడని కల్పలత పేర్కొన్నారు.
బన్నీకి అంత డెడికేషన్ ఉంటుందని నాకు ఇద్దరు ఆడపిల్లలని మగపిల్లలు లేరని ఎప్పుడూ బాధపడలేదని కల్పలత చెప్పుకొచ్చారు.

తన కూతుళ్లు అమెరికాలో ఉన్నారని కల్పలత పేర్కొన్నారు.పుష్ప మూవీ షూటింగ్ అయ్యాక మాత్రం తాను చాలా బాధపడ్డానని కల్పలత చెప్పుకొచ్చారు.బన్నీని చూసిన తర్వాత ఇలాంటి కొడుకు ఉంటే బాగుండేదని అనిపించిందని కల్పలత పేర్కొన్నారు.

బన్నీ సపోర్ట్ గా చేయి పట్టుకునేవారని కళ్లతోనే నేనున్నానంటూ ధీమా ఇచ్చేవారని కల్పలత వెల్లడించారు.పుష్పరాజ్ లాంటి కొడుకు ఉంటే బాగుండేదని తాను బన్నీతో చెప్పగా బన్నీ దగ్గరకు తీసుకుని ఓదార్చాడని కల్పలత అన్నారు.పుష్ప సినిమా ద్వారా కల్పలతకు మంచి గుర్తింపు దక్కగా పుష్ప పార్ట్2 లో కూడా ఈమె పాత్రకు బాగానే ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
ఫిబ్రవరి నెల నుంచి పుష్ప పార్ట్2 సెట్స్ పైకి వెళ్లనుంది.