స్టార్ హీరోల సినిమాలు విడుదల అయినప్పుడు థియేటర్ల వద్ద సందడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకే నెలలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే సినీ ప్రేక్షకులు అందరూ కూడా పండగ చేసుకుంటారు.
అది కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు విడుదల అయితే ఇక అంతకంటే ప్రేక్షకులకు ఇంకేం కావాలి.ఇప్పుడు బాక్సాఫీసు వద్ద తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా పవర్ స్టార్ గా కొనసాగుతున్న మెగాబ్రదర్ లు ఒకే నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు అని తెలుస్తోంది.
అయితే సాధారణంగా మెగాస్టార్ సినిమా విడుదలైంది అంటే మెగా అభిమానులు అందరూ థియేటర్లకు బారులు తీరుతూ ఉంటారు.అలాంటిది మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాలు కేవలం రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి అంటే మెగా అభిమానులందరూ మూవీ మేనియా ఎంజాయ్ చేస్తూ ఎంతగానో సందడి చేస్తూ ఉంటారు.
కానీ ఇలాంటివి జరగడం చాలా అరుదుగానే జరుగుతుంది.కానీ ఇప్పుడు అభిమానుల కోరిక తీరబోతుంది అని తెలుస్తోంది.
ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కేరీర్ ప్రారంభించిన 25 ఏళ్ల ప్రయాణంలో ఒక్కసారి కూడా అన్నయ్య చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలలు ఒక్క సారి కూడా ఒకే నెలలో విడుదల కాలేదు.
కానీ ఇప్పుడు మాత్రం మెగాస్టార్ సినిమా విడుదలైన తర్వాత నెల రోజుల గ్యాప్ కూడా లేకుండానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కూడా విడుదల కాబోతుంది.సాధారణంగా మెగా హీరోలు తమ సినిమాలను ఫిబ్రవరి మాసంలో విడుదల చేయడం ఎన్నో రోజుల నుంచి సెంటిమెంట్ గా పెట్టుకున్నారు.కాగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే అదే నెల 25వ తేదీన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా కూడా విడుదల కాబోతుండడం గమనార్హం.ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు మురిసిపోతున్నారు.అదే సమయంలో ఈ రెండు చిత్రాల్లో ఏది మంచి ఫలితాలను సాధిస్తుందన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.రెండు సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమాలే కావడం గమనార్హం.