సాయి పల్లవి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తన నటనతో, డాన్స్ తో ఎంతమంది ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేసింది.
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకుంది.ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
దక్షిణాది టాప్ హీరోయిన్ లలో సాయి పల్లవి కూడా ఒకరు.ఫిదా, మారి, లవ్ స్టోరీ, పడి పడి లేచే మనసు, మిడిల్ క్లాస్ అబ్బాయి, లాంటి సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తోంది.రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా ఉన్నారు.ఈ సినిమా పునర్జన్మ బెంగాల్ నేపథ్యంతో తెరకెక్కబోతోంది.
శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి సాయి పల్లవి మాట్లాడుతూ…నానితో కలిసి నటిస్తున్న రెండవ సినిమా ఇది.మేము మా పాత్రల గురించి, ఆ పాత్రలు ఇంకా బాగా ఎలా పోషించాలి అనే విషయాల గురించి మాట్లాడుకునే వాళ్ళం.సినిమా అయిపోయి ఎడిట్ చేసిన తర్వాత కూడా సీన్ లను పరిశీలించి నోట్స్ షేర్ చేసుకునే వాళ్లం అని తెలిపింది.
ఈ క్రమంలోనే మాట్లాడుతూ పునర్జన్మను నమ్ముతారా అని సాయి పల్లవి అని అడిగినప్పుడు ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
అప్పుడప్పుడు నేను ఒక యువరాణి అనే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.నేను 6,7 తరగతిలో ఉన్నప్పుడు ఈజిప్ట్ యువరాణులు, క్వీన్ నెఫెర్టిటి గురించి ఎక్కువగా చదివాను.నా గథ జన్మలో నేను ఖచ్చితంగా యువరాణి అయి ఉంటాను అని అనిపించింది.కాబట్టి నేను కూడా పునర్జన్మను నమ్ముతాను అని ఆమె తెలుపుతూ మనసులోని మాటను బయట పెట్టింది సాయి పల్లవి.
అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ఆ కాలం నాటి సెట్స్ లో ఉండటం, అప్పటి కాస్ట్యూమ్స్ వేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది.