కొంతమంది హీరో హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే మంచి ఆరంభం లభించడంతో దాదాపుగా సినీ కేరీర్ గాడిలో పడినప్పటికీ క్రమక్రమంగా కథల విషయంలో అవగాహన లోపించడంతో మరియు ఇతర కారణాల వల్ల సినీ కేరీర్ ని పోగొట్టుకున్నటువంటి నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.ఇందులో ప్రముఖ దర్శకుడు విరించి వర్మ మరియు నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కిన మజ్ను అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం మలయాళ బ్యూటీ అను ఇమాన్యుయేల్ కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే ఈ చిత్రంలో అను ఇమాన్యుయేల్ సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ తన అందం అభినయం నటన ప్రతిభ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.దీంతో మలయాళ సినీ పరిశ్రమలో కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ పెరిగిపోయింది.
అంతే కాకుండా ఒక్కసారిగా ఒకే సంవత్సరంలో దాదాపుగా 3 సినిమా ఆఫర్లు వరించాయి.కానీ ఇందులో కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రం పర్వాలేదు అనిపించినప్పటికీ ఆక్సిజన్ మరియు మరో తమిళ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
కానీ అదృష్టవశాత్తూ అప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది.కానీ అను ఇమాన్యుయేల్ కి ఈ సంబరం ఎంతో కాలం నిలవలేదు.
ఎందుకంటే అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్ గా నిలిచింది కాబట్టి.
అయినప్పటికీ అనూ ఇమాన్యుయేల్ లక్ బాగుండటంతో తో ఈసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు తెలుగు ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో ఏకంగా హీరోయిన్ గా నటించే అవకాశం వరించింది.కాని దురదృష్టవశాత్తు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడి సినీ కెరియర్ ఆశించిన స్థాయిలో సాగలేదు.
దీనికి తోడు ఈ మధ్య కాలంలో అను ఇమాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన శైలజ రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.
దీంతో కొందరు సినీ ప్రముఖులు అను ఇమాన్యుయేల్ సినీ కేరీర్ పై ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇక నుంచయినా అను ఇమాన్యుయేల్ కథల విషయంలో మరియు తన పాత్రల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆమె సినీ కేరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాగే ప్రస్తుతం అను ఇమాన్యుయేల్ కి అభినయం నటన ప్రతిభ మరియు మంచి వయసు కాబట్టి గ్లామర్ ఓరియెంటెడ్ పాత్రలలో నటిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అను ఇమాన్యుయేల్ తెలుగులో తెలుగు ప్రముఖ స్టార్ హీరోలైన శర్వానంద్ మరియు సిద్ధార్థ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ మహాసముద్రంలో సిద్ధార్థ కి జోడిగా నటించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతోంది.ప్రస్తుతం అను ఇమాన్యుయేల్ కి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొత్త సినిమా అవకాశాలు ఏమి చేతిలో లేవు.