తెలుగు ప్రేక్షకులకు శోభన్ బాబుగా సుపరిచితులైన శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు.ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు రైతు కుటుంబంలో జన్మించినా సినిమాలపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా సక్సెస్ సాధించారు.
కుటుంబ కథా చిత్రాలలో నటించడం ద్వారా శోభన్ బాబు ఆ సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులకు చేరువయ్యారు.పౌరాణిక సినిమాలతో పాటు జానపద సినిమాలలో సైతం శోభన్ బాబు నటించారు.
శోభన్ బాబు నటించిన సినిమాలు కొన్ని సినిమాలు ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.ఆయన నటించిన మనుషులు మారాలి సినిమా అప్పట్లోనే ఏకంగా 25 వారాలు ఆడింది.
ఈ సినిమాలో కార్మిక నాయకుడి పాత్రలో శోభన్ బాబు అద్భుతంగా నటించారు.అంద వికారుడైన రచయితగా శోభన్ బాబు నటించిన చెల్లెలి కాపురం సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
శోభన్ బాబు నటించిన మరో సినిమా ధర్మపీఠం దద్దరిల్లింది బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.అవినీతికి పాల్పడుతున్న కొడుకులను అంతం చేసే పాత్రలో శోభన్ బాబు అద్భుతంగా నటించి మెప్పించారు.శోభన్ బాబు నటనకు పదుల సంఖ్యలో అవార్డులు వచ్చాయి.ప్రముఖ నిర్మాతలలో ఒకరైన ఎన్వీ సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆరోజుల్లో హీరోలకు 15,000 అలా రెమ్యునరేషన్ ఉండేదని అన్నారు.
శోభన్ బాబు రెమ్యునరేషన్ తక్కువగా ఉందని పెంచాలని అడిగారని మీరు పెంచితేనే మేం ఎదుగుతాం అని చెప్పగా మా సినిమా 40 50 రోజులు ఆడితే కొంత మొత్తం గిఫ్ట్ గా ఇస్తామని చెప్పామని ఎన్వీ సుబ్బరాజు చెప్పుకొచ్చారు.నిజంగా ఇస్తారా? ఇవ్వకపోతే ఆరోజు వచ్చి వసూలు చేస్తానని శోభన్ బాబు అన్నారని ఎన్వీ సుబ్బరాజు పేర్కొన్నారు.శోభన్ బాబు గారు ఆఫీస్ కు వచ్చి ఆరో వారం తర్వాత 2,500 ఇవ్వాలి కదా అని అడగగా 2,500 రూపాయల కవర్ ఇచ్చామని ఎన్వీ సుబ్బరాజు తెలిపారు.ఆ తర్వాత తమాషాగా అన్నానని నువ్వు ఇస్తావని నాకు తెలుసని శోభన్ బాబు చెప్పారని ఎన్వీ సుబ్బరాజు చెప్పుకొచ్చారు.