టాలీవుడ్ లో అగ్ర దర్శకుడుగా వెలుగొందుతున్నాడు జక్కన్న.ఈయన ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా చూడలేదు.
అందుకే 99 శాతం సక్సెస్ రేట్ ను కలిగి ఉన్నాడు రాజమౌళి. ప్రసెంట్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎందరో లెజెండరీ డైరెక్టర్లలో రాజమౌళికి తప్ప మరే డైరెక్టర్ కు ఈ సక్సెస్ రేట్ లేదు.
ఒక్క రాజమౌళి మాత్రమే చేసిన ప్రతి సినిమా హిట్ అయ్యి సక్సెస్ రేట్ లో 99 శాతం కలిగి ఉన్నాడు.
ఇప్పుడు రాజమౌళి మరొక అరుదైన రికార్డ్ సాధించాడు.
ప్రపంచం లో 50 కూలెస్ట్ ఫిలిం మేకర్స్ లో స్థానం సంపాదించాడు జక్కన్న.వాస్తవానికి ఈ జాబితాలో ఇండియా నుండి జక్కన్న ఒక్కడే కావడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 మంది చిత్ర నిర్మాతలలో రాజమౌళి 25 వ స్థానాన్ని దక్కించు కున్నాడు.ఆస్కార్ విన్నింగ్ పారసైట్ మూవీని రూపొందించిన కొరియన్ దర్శకుడు ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాడు.
ఈ మధ్య కాలంలో రాజమౌళి తీసిన అన్ని సినిమాలు ఇండియా మొత్తం ఆదరణ పొందాయి.అంతేకాదు కలెక్షన్ల సునామీ కూడా సృష్టించాయి.
ఈయన సినిమాలు కేవలం ఇండియా మాత్రమే పరిమితం కాలేదు.అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాయి.
అందుకే ఈ కూలెస్ట్ ఫిలిం మేకర్స్ లిస్టులో 25 వ స్థానాన్ని సంపాదించు కోవడంలో సఫలం అయ్యాడు.
ప్రజంట్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించారు.ప్రెసెంట్ చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ లో బిజీగా ఉంది.
ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.మరి ఈ సినిమాతో రాజమౌళి ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.