విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటాన్ని తప్పుపడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అధికార పార్టీ వైసీపీ నిర్లక్ష్యం వహిస్తుందని ప్రతిపక్షాలు గత కొంత కాలం నుండి విమర్శలు చేస్తూ ఉన్నాయి.
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటాన్ని తప్పుపడుతూ… వైజాగ్ లో సభ కూడా నిర్వహించారు.ప్రభుత్వానికి 2 వారాల సమయం ఇచ్చి డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే రెండు వారాల గడువు ముగియటంతో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో విశాఖ కార్మికులతో కలిసి దీక్ష చేయటానికి రెడీ అయ్యారు.
డిసెంబర్ 12వ తారీకున మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో… ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయడానికి రెడీ అయ్యారు.
ఇదిలా ఉంటే వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నది జనసేన పార్టీ మిత్రపక్షం కేంద్రంలో ఉన్న బిజెపి కావటంతో ఈ క్రమంలో దీక్షలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా లేక పోతే గతంలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీపై పవన్ విమర్శలు చేస్తారా అన్నది.ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో విశాఖపట్టణంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో… ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ పవన్ విమర్శలు చేశారు.అయితే ఇప్పుడు మంగళగిరి లో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎల్లుండి చేపట్టబోయే దీక్షలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారా.? లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తారా అన్నది సస్పెన్స్ గా నెలకొంది.