టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ను ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నిన్న ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో ప్రకటించబోతున్నట్లుగా అంతా ఆసక్తి గా ఎదురు చూశారు.
కాని కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి చెందడటంతో ఆ అప్డేట్ ప్రకటన వాయిదా వేయడం జరిగింది.నిన్న సాయంత్రం రావాల్సిన అప్‌డేట్ ను నేడు ఇచ్చారు.
నవంబర్ 1న ఉదయం 11 గంటలకు ఆర్ ఆర్ ఆర్ గ్లింప్స్ రాబోతున్నట్లుగా అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన హీరో ల టీజర్ లను ఇప్పటికే విడుదల చేశారు.అయితే అవి మేకింగ్ వీడియోలు కావడం వల్ల సినిమా కథ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు.కనుక ఈ గ్లింమ్స్ లో అయినా సినిమా ఎలాంటి కంటెంట్ ను కలిగి ఉంటుందో చూపిస్తారేమో చూడాలంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేస్తారనుకుంటే గ్లింమ్స్ అంటూ విడుదల చేయబోతున్నారు.సరే ఏదో ఒకటి అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ గ్లిమ్స్ కు రికార్డు బ్రేకింగ్ యూట్యూబ్ వ్యూస్ మరియు లైక్స్ వస్తాయని అంతా నమ్మకం గా ఉన్నారు.ఇటీవల వచ్చిన రాధే శ్యామ్ తరహాలోనే భాష తో సంబంధం లేకుండా అన్ని భాషలకు ఒకే ఒక్కటి విడుదల చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.