చిన్నారులపై జరుగుతున్న దారుణాలు అన్ని ఇన్ని కావు.ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో చిన్నారులపై ఎంత దారుణంగా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.
మరీ ముఖ్యంగా చిన్న పిల్లల మీదనే ఈ దారుణాలు ఎక్కువవుతున్నాయి.కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయే విషయం మాత్రం వినడానికి కూడా చాలా దారుణమైనది.
ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకునేలా ఉంటుంది.ఈ దారుణం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే అన్నట్టు ఉంది.
ఇప్పటి దాకా బాలికల మీద కేవలం పెద్దవారు మాత్రమే దారుణాలకు పాల్పడటం మనం చూస్తున్నాం.కానీ ఇప్పుడు పదకొండేళ్ల పిల్లలు ఈ దారుణానికి పాల్పడ్డారు.వినడానికి కూడా భయంకరంగా ఉన్నా కూడా ఇదే నిజం.అసోం రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
మిస్సా గ్రామంలో నివసిస్తున్న 8 నుంచి 11 ఏండ్ల వయసున్నటువంటి ముగ్గురు బాలురు ఓ రోజు బూతు మూవీలు ఫోన్ను తమ ముందు పెట్టుకున్నారు.అయితే అటుగా వచ్చిన ఓ ఆరేళ్ల చిన్నారిని కూడా బూతు సినిమా చూడాలంటూ ఒత్తిడి చేశారు.
అందుకు ఆ పాప ససేమిరా అనడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ బాలురు దారుణానికి ఒడిగట్టారు.ఆ పాపాను రాళ్లతో కొట్టి మరీ అత్యంత క్రూరంగా చంపేశారు.దీంతో ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అలజడి రేపింది.లేకుంటే పదకొండేళ్ల చిన్నారులకు అశ్లీల వీడియోలు చూడాలనిపించడ ఏంటి, పైగా పాపను అంత దారుణంగా చంపేయడం ఏంటన్న విషయాలు ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి.
పిల్లలు ఇలా తయారవడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని చెబుతున్నారు విశ్లేషకులు.ఏదేమైనా ఈ ఘటన మాత్రం అందరినీ షాక్కు గురి చేస్తోంది.