ఇకపై రేషన్ కార్డు కు నయా రూల్స్..! దాంతో వారందరికీ రేషన్ బందేనా..?!

మనిషి గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఎంత అవసరమో, ఆలాగో రేషన్ కార్డ్ కూడా అంతే అవసరం.జాతీయ ఆహార భద్రత పథకం కింద పేద కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్నవారికి ఆహార ధాన్యాలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 New Rules For Ration Card Now Does Ration Stops To All Of Them, Ration Card, New-TeluguStop.com

రేషన్ కార్డు ఉంటేనే ఆహార ధాన్యాలు ఇవ్వడం జరుగుతుంది.పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం కింద కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు.

రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం వన్ పేదలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులను అందజేస్తుంది.అంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టే విషమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి.

అయితే దేశంలో అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు లేకపోవడం, అర్హులు కాని వారికి రేషన్ కార్డ్ వుండడం చూస్తూ ఉన్నాం.ఎక్కువమంది అనర్హులు రేషన్ కార్డులు కలిగి ఉండటంతో, అర్హులకు అందాల్సిన రేషన్ అందడం లేదు.

దీంతో అర్హులు కాని వారు నిబంధనలకు విరుద్ధంగా సరుకులు తీసుకుంటున్నారని కేంద్రానికి ఫిర్యాదులు అందడంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం అనర్హులను గుర్తించే పనిలో పడింది.దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు సందర్భాల్లో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

Telugu Central, Latest, Approve, Public Scheme-Latest News - Telugu

రాష్ట్రాల ప్రతిపాదనలను సూచనలను పరిగణలోకి తీసుకొని కేంద్రం త్వరలో కొత్త నిబంధనలను జారీ చేయనుంది.ఒకవేళ ఈ నిబంధనలు అమలు అయితే ఇక నుంచి చాలామంది అనర్హులుగా ఉండి రేషన్ కార్డు కలిగిన వారికి ఇక రేషన్ ఉండదు.అర్హులకు మాత్రమే రేషన్ కార్డ్ కలిగి ఉంటారు.

జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

దీని ద్వారానే రేషన్ కార్డులు జారీ చేస్తారు.అయితే కొత్త సాఫ్ట్వేర్ కారణంగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కావాలన్నా, ఉన్న రేషన్ కార్డు పునరుద్ధరించాలన్నా, కొత్త సభ్యుడు పేరు చేర్చాలన్నా, దాదాపు పది రకాల పత్రాలు అవసరం అవుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube