నటుడిగా, వ్యాఖ్యాతగా వ్యవహరించి, తన టాలెంట్ తో బుల్లితెరపై చెరగని ముద్ర వేసుకున్నారు శ్రీ కృష్ణ కౌశిక్. ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ శ్రీ కృష్ణ కౌశిక్ తనకు జరిగిన ఒక అనుభవాన్ని గురించి వివరిస్తూ ఇలా చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ లు vip జైళ్లో ఉన్నపుడు తాను జనరల్ బరాక్ లో ఉన్నానని ప్రముఖ బుల్లి తెర నటుడు శ్రీ కృష్ణ కౌశిక్ తెలిపారు.అప్పుడు అక్కడ దాదాపు 80 మంది ఖైదీలు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఒక్కొక్కరికి ఒక ప్లేట్, ఒక దుప్పటి ఇచ్చారని, ప్లేట్ పక్కనే పెట్టుకున్నా ఎవరో తీసుకున్నారని ఆయన నవ్వుతూ చెప్పారు.అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ కి చెప్తే.
దొంగలుంటారు చూస్కోవాలి మీరే అని తనకు చెప్పినట్టు ఆయన తెలిపారు.అక్కడ బాత్ రూంలకు కూడా డోర్లు లేవని, ఐనా అలాగే వెళ్ళామని శ్రీ కృష్ణ కౌశిక్ అన్నారు.
ఇక అక్కడ హాజరు తీసుకునే విధానం గురించి ఆయన చెబుతూ… అందర్నీ కౌంట్ చేసుకుంటూ వస్తూ తన దగ్గరికి రాగానే ఏంటి సార్ అని అన్నారని ఆయన చెప్పారు.ఆయన ఆ సమయంలో మీరు ఫైట్ చేస్తున్న కారణం మంచిది సర్, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీకు అది మంచి చేస్తుంది అని జైలర్ అన్నట్టు శ్రీ కృష్ణ కౌశిక్ తెలిపారు.
ఆ సందర్భంలో ఆయన అలా అనడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందని ఆయన అన్నారు.
ఇకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ లో పేరు నమోదు చేసుకొని, మొలతాడు, ఏదైనా తాల్లు ఉన్నాయేమో అని చూసి వాటిని కట్ చేసేవారని ఆయన తెలిపారు.అంతే కాకుండా అక్కడ ఖైదీలను నేక్డ్ గా ఉండమని అనే సరికి చాలా షాక్ అయ్యానని ఆయన చెప్పారు.ఎందుకు అంటే వాళ్లకు ఎక్కడైనా గాయాలు అయ్యాయా అని టార్చ్ లైట్ వేసి చూస్తారని ఆయన తెలిపారు.
ఒకవేళ ఏమైనా అయితే కేస్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అని ఆయన చెప్పారు.
మమ్మల్ని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లాక, కానిస్టేబుల్ నన్ను చూసి సర్ మీరా .బట్టలు వేసుకొండి సర్.నేను చెపుతాను బయట వాళ్లకు అని అనేసరికి కళాకారుడికి ఇంత మర్యాద ఉంటుందా అని అప్పుడు అనిపించినట్టు ఆయన తెలిపారు.అలా బట్టలు విప్పాలి అని అన్నప్పుడు మాత్రం ఒక భయం వచ్చేసింది అని ఆయన అన్నారు.