కోతి చేసే పనులు ఊహకు కూడా అందవేమో.అందుకే అవి చేసినట్టు ఎవరైనా వారివి కోతి చేష్టలని అంటారు.
కోతులు అంటే ఒకప్పుడు అడవుల్లో ఉండేవి గానీ ఇప్పుడైతే ఇండ్లల్లోనే ఉంటున్నాయి.పబ్లిక్ చేసుకునే ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, లేదా ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిన ఘటనలు మనం చూశాం.
అయితే ఇప్పుడు ఓ కోతి చూసిన పని తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.ఎందుకుంటే ఓ కోతి దొంగ అవతారం ఎత్తుకుంది.
తనకు అవసరం లేని డబ్బులను ఎత్తుకెళ్లి బాధితుడిని నానా ఇబ్బందులు పెట్టేసింది.
దీంతో ఆ కోతి చేసిన పనికి బాధితుడు లబోదిబోమంటున్నాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌జిల్లాలోని కాటవ్ ఘాట్ రోడ్డులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.ఎందుకంట ఈ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ ఆటోలో ముగ్గురు వ్యక్తులు కూర్చుని వెళ్తున్నారు.
కాగా ఇందులో ఓ వ్యక్తి తన దగ్గరున్న తువ్వాలలో లక్ష రూపాయలు గట్టిగా చుట్టేసుకుని తన వెంటనే ఆటోలో తీసుకెళ్తున్నాడు.అయితే వీరు ఘాట్ రోడ్డు దగ్గరకు రావడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.
దీంతో ఆటో అక్కడే నిలిచిపోయింది.దీంతో ఏం జరిగిందో చపూద్దామంటూ ఆ ముగ్గురూ ఆటోనుంచి కిందకు దిగారు.

అయితే ఈ ముగ్గరిలో మహ్మద్ అలీ తీసుకొస్తున్న లక్ష రూపాయలు చుట్టిన టవల్‌ను అలాగే ఆటోలో వదిలిపెట్టి దిగారు.అయితే దగ్గరలోని చెట్టుమీద ఉన్న ఓ కోతి ఆ టవల్ ఏమైనా తినే వస్తువులు ఉన్నాయనుకుని దాన్ని ఎత్తుకెళ్లింది.చెట్టుమీదకు తీసుకెళ్లి టవల్‌ను విప్పడంతో డబ్బులు మొత్తం కింద పడిపోయాయి.
అవికూడా చెల్లాచెదురుగా అక్కడక్కడ పడటంతో మహ్మద్ అలీ కొన్నింటిని ఏరుకున్నాడు.కానీ మొత్తం డబ్బులు మాత్రం దొరకలేదు.ఇక కోతి అతనికి దొరకకుండా వాటిని ఎత్తుకెళ్లడంతో రూ.56 వేలు మాత్రమే దొరికాయి.మిగతా రూ.44వేలు దొరక్క పోవడంతో ఆయన దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
.