భారీగా గడ్డం పెంచుకోవడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది.సినిమా హీరోల దగ్గర నుంచి కాలేజ్‌కి వెళ్లే అబ్బాయిల వరకు అందరూ గడ్డాన్ని తెగ పెంచేసుకుంటున్నారు.
అయితే ఒత్తుగా గడ్డాన్ని పెంచుకోవడం వల్ల లాభమ లేక నష్టమా.అంటే ఖచ్చితంగా లాభమనే చెప్పాలి.
అవును, గడ్డాన్ని పెంచుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్‌ను పొందొచ్చు.మరి అబ్బాయిలూ.
గడ్డం పెంచుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటో లేట్ చేయకుండా కిందకు ఓ లుక్కేసేయండి.
భారీగా గడ్డాన్ని పెంచుకోవడం వల్ల సూర్యుడి నుంచి విడుదలయ్యే రేడియేషన్ కిరణాలు చర్మంపై నేరుగా పడకుండా ఉంటాయి.
దాంతో చర్మం ట్యాన్ అవ్వకుండా ఉంటుంది.మరియు ముడతలు, మొటిమలు సైతం రాకుండా ఉంటాయి.
అలాగే చర్మం డ్రైగా, రఫ్‌గా ఉండకూడదు అంటే న్యాచురల్ ఆయిల్స్ కలిగి ఉండటం ఎంతో అవసరం.కానీ, క్లీన్‌గా షేవ్ చేసుకున్న ప్రతి సారీ షేవింగ్ క్రీముల్లో ఉండే కెమికల్స్ కారణంగా న్యాచురల్ ఆయిల్స్ కోల్పోతారు.
అదే షేవింగ్‌తో పని లేకుండా గడ్డం పెంచుకుంటే స్కిన్ స్మూత్ సాఫ్ట్‌గా ఉంటుంది.గడ్డాన్ని భారీగా పెంచు కోవడం వల్ల పొందే మరో సూపర్ బెనిఫిట్స్ ఏంటీ అంటే.
ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్స్‌కి కారణమయ్యే బ్యాక్టీరియా, టాక్సిన్స్ వంటివి ముక్కు మరియు నోటిలోకి వెళ్లకుండా ఉంటాయి.బ్యాక్టీరియా, టాక్సిన్స్ లోపలికి వెళ్ళకుండా గడ్డం అడ్డు కట్ట వేసేస్తుంది.
ఇక మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే. గడ్డం ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలకు త్వరగా లైక్ చేస్తుంటారు.క్లీన్ షేవ్‌లో ఉండే అబ్బాయిల కంటే గడ్డం ఉండే అబ్బాయిలే ఎట్రాక్టివ్ గా, మెచ్యూర్డ్ గా, స్మార్ట్‌గా మరియు కాంఫిడెంట్‌గా కనిపిస్తారు.అందు వల్లనే, గడ్డం ఉండే అబ్బాయిలనే అమ్మాయిలు త్వరగా ఇష్టపడతారట.
అయితే అందరికీ గడ్డాన్ని పెంచుకోవడం సాధ్యం కాకపోవచ్చు.కానీ, సాధ్యమైతే మాత్రం గడ్డాన్ని పెంచుకోవడానికే ఖచ్చితంగా ప్రయత్నించండి.