వైరల్: బిగ్ బాస్ హౌస్ లోకి విడాకులు తీసుకున్న జంట ఎంట్రీ!

ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది.రియాలిటీ షోలలో ది బెస్ట్ షో గా నిలిచిన ఈ షో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషలలో ప్రసారమై ప్రేక్షకుల దృష్టిని బాగా మలుపుకుంది.

 Bigg Boss, Divorce, Marathi Cinema,bigg Boss 3, Reality Show,latest News-TeluguStop.com

ఇక రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి.ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లందరు సెలబ్రేటీలే.

ఈ షో ద్వారా సెలబ్రేటీలు తమ నిజ జీవితంలో ఎలా ఉంటారో ప్రేక్షకులు తెలుసుకోవడానికి బాగా ఆరాటపడుతుంటారు.

ఇక ఇందులో ఒక రియల్ జంటను కూడా పంపిస్తారు.

కానీ ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో అడుగుపెట్టని విడిపోయిన జంట ఈసారి బిగ్ బాస్ లో పాల్గొన్నారు.అది తెలుగు బిగ్ బాస్ కాదు. మరాఠీ బిగ్ బాస్.ప్రస్తుతం మరాఠీలో కూడా సీజన్ 3 ప్రారంభమైంది.

ఇందులో మరాఠీ నటీనటులు స్నేహ వాగ్, ఆవిష్కర్ దర్వేకర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.

Telugu Bigg Boss, Divorce, Marathi, Reality Show-Movie

వీరికి గతంలో పెళ్లి జరిగింది.ఇక కొన్నేళ్ల తర్వాత స్నేహ తన భర్త దర్వేకర్ తనను హింసిస్తున్నాడని అతని నుండి విడాకులు తీసుకుంది.అప్పటి నుంచి దూరంగా ఉంటున్న ఈ జంట మళ్లీ బిగ్ బాస్ షో తో కలుసుకునే అవకాశం వచ్చింది.

ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ వీరిని మరోసారి కలపాలని చూస్తున్నట్లు అర్థమవుతుంది.ఇక ఇందులో వీరు కలుస్తారా లేదా మరింత పగలు పెంచుకుంటారో తెలియదు కానీ మొత్తానికి వీరికి మరో అవకాశం దొరికిందని నెటిజన్లు అంటున్నారు.

ఇక వీరు హౌస్ లో ఎంతవరకు కొనసాగుతారో ఇంటికి వెళ్లేటప్పుడు ఎలా వెళ్తారో చూడాలని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube