ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా భగ్గుమంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పెరిగిన ధరలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఒకవైపు కరోనా సమయంలో కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోవడంతో ఎవరూ తట్టుకోలేకపోతున్నరు.ఇక రాజకీయ నాయకులు ఎవరూ కూడా వీటిపై పెద్దగా స్పందించట్లేదు.
ఎవరి స్వార్థం వారికే ఉన్నా కూడా వీటిపై చాలా వరకు నిరసనలు రేగుతున్నా పెద్దగా ప్రభావం చూపట్లేదు.అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పెట్రోల్ రేట్లపై బాగానే నిరసన వెల్లడవుతోంది.
కానీ కేంద్రం మాత్రం తమకేమీ పట్టనట్టుగా ధరలను ఇంకా పెంచుకుంటూనే పోతోంది.ఇక ప్రతిపక్షాల సంగతి కూడా తెలియనిది ఏముంది.వారు అధికారంలో ఉంగా ఒకమాట ప్రతిపక్షంలోకి రాగానే మరో మాట మాట్లాడుతుంటారు.కాగా ఇక్కడే ఏపీలో ఒక విషయం బాగా చర్చనీయాంశంగా మారుతోంది.
అదేంటంటే దివంగత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో గ్యాస్ ధరలు అకస్మాత్తుగా పెరిగిపోతే రాష్ట్ర వ్యాప్తంగా నానా నిరసనలు వెల్లువెత్తాయి.దీంతో ఆయన కూడా వీటిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

ఇక ఇలాగే ఉపేక్షిస్తే లాభం లేదని అప్పుడు గ్యాస్ మీద రాష్ట్రం విధించే పన్నుల్లో ఏకంగా రూ.25 తగ్గించి పెద్ద సంచలనం రేపేశారు.రూ25 అయినా కూడా మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందనే చెప్పాలి.ఈ కారణంగానే ఆయన్ను జనాలు దేవుడిలా భావించేవారు.
అయతే ఇప్పుడు ఆయన కొడుకు జగన్ సీఎంగా ఉండటంతో ఆయన కూడా ఇప్పుడు రాష్ట్రం విధించే పన్నుల్లో ఏమైనా మినహాయింపు ఇస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.తండ్రి వైఎస్సార్ సంక్షేమం విషయంలో రెండడుగులు వేస్తే తన హయాంలో ఏకంగా నాలుగు అడుగులు వేసి చూపిస్తానని చెప్పుకునే జగన్ ఈ విషయంలో గనక ఇలా చేస్తే నిజంగానే ప్రజల్లో ఆయనకు తిరుగుండదేమో.