మాస్టర్ చెఫ్ హోస్ట్ గా వెంకటేష్ చేస్తే..!

తమన్నా హోస్ట్ గా త్వరలో టెలికాస్ట్ కాబోతున్న మాస్టర్ చెఫ్ షో గురించి ఆసకికరమైన వార్త బయటకు వచ్చింది.హిందీలో సూపర్ సక్సెస్ అయిన మాస్టర్ చెఫ్ షో తెలుగు వర్షన్ అనుకున్నప్పుడు ఈ షోకి స్టార్ హీరో హోస్ట్ గా చేస్తే బాగుంటుందని అనుకున్నారట.

 Venkatesh First Choice For Master Chef, Master Chef Show In Telugu, Tamanna, Ven-TeluguStop.com

ఈ క్రమంలో షో నిర్వాహకులు ఒకరిద్దరి స్టార్స్ ను అనుకున్నారట.అయితే వారిలో వెంకటేష్ ఉన్నట్టు తెలుస్తుంది.

మాస్టర్ చెఫ్ షోకి హోస్ట్ గా చేయాలని వెంకటేష్ ను అడగాలని అనుకున్నారట.సురేష్ బాబు ద్వారా డీల్ చేయాలని చూశారు.

అయితే వెంకటేష్ కాకుంటే మీ ఆప్షన్ ఎవరు అంటే అప్పుడే తమన్నా ఆలోచనలోకి వచ్చిందట.ఆమె పేరు సురేష్ బాబు ముందు ఉంచారట.

అయితే వెంకటేష్ కన్నా తమన్నానే బెస్ట్ ఆప్షన్ అని చెప్పారట సురేష్ బాబు.

ఆయన చెప్పడంతో ఇక మాస్టర్ చెఫ్ షోని వెంకటేష్ దాకా వెళ్లకుండానే తమన్నాని హోస్ట్ గా ఫిక్స్ చేశారు .వెంకటేష్ కూడా ఇలాంటి షోలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడని సురేష్ బాబుకి తెలుసు అందుకే ముందుగానే ఆయన ఈ షోకి తమన్నానే పర్ఫెక్ట్ అని డిక్లరేషన్ ఇచ్చారు.ఇక మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ కూడా మాస్టర్ చెఫ్ షోకి ప్లస్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube