మాస్టర్ చెఫ్ హోస్ట్ గా వెంకటేష్ చేస్తే..!
TeluguStop.com
తమన్నా హోస్ట్ గా త్వరలో టెలికాస్ట్ కాబోతున్న మాస్టర్ చెఫ్ షో గురించి ఆసకికరమైన వార్త బయటకు వచ్చింది.
హిందీలో సూపర్ సక్సెస్ అయిన మాస్టర్ చెఫ్ షో తెలుగు వర్షన్ అనుకున్నప్పుడు ఈ షోకి స్టార్ హీరో హోస్ట్ గా చేస్తే బాగుంటుందని అనుకున్నారట.
ఈ క్రమంలో షో నిర్వాహకులు ఒకరిద్దరి స్టార్స్ ను అనుకున్నారట.అయితే వారిలో వెంకటేష్ ఉన్నట్టు తెలుస్తుంది.
మాస్టర్ చెఫ్ షోకి హోస్ట్ గా చేయాలని వెంకటేష్ ను అడగాలని అనుకున్నారట.
సురేష్ బాబు ద్వారా డీల్ చేయాలని చూశారు.అయితే వెంకటేష్ కాకుంటే మీ ఆప్షన్ ఎవరు అంటే అప్పుడే తమన్నా ఆలోచనలోకి వచ్చిందట.
ఆమె పేరు సురేష్ బాబు ముందు ఉంచారట.అయితే వెంకటేష్ కన్నా తమన్నానే బెస్ట్ ఆప్షన్ అని చెప్పారట సురేష్ బాబు.
ఆయన చెప్పడంతో ఇక మాస్టర్ చెఫ్ షోని వెంకటేష్ దాకా వెళ్లకుండానే తమన్నాని హోస్ట్ గా ఫిక్స్ చేశారు .
వెంకటేష్ కూడా ఇలాంటి షోలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడని సురేష్ బాబుకి తెలుసు అందుకే ముందుగానే ఆయన ఈ షోకి తమన్నానే పర్ఫెక్ట్ అని డిక్లరేషన్ ఇచ్చారు.
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ కూడా మాస్టర్ చెఫ్ షోకి ప్లస్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
భారతదేశంలో భరించలేని పరిస్థితులు.. జపనీస్ టూరిస్ట్ కన్నీటి పర్యంతం!