జంతువుల వెంట్రుక‌ల‌ను ఈ ప‌క్షులు దొంగ‌త‌నం చేస్తాయంట‌.. ఎందుకంటే..?

ఈ భూమ్మీద ప్ర‌తి జంతువు కూడా సొంత గూటి కోస‌మే పాకులాడుతుంది.ఏదో ఒక‌టి చేసి అయినా స‌రే ఒక గూడును ఏర్పాటు చేసుకోవ‌ల‌ని చూస్తుంది.

 Sneaky Birds Steals Hair From Animals To Build Nest, Birds Stealing Hair, Animal-TeluguStop.com

ఇక మ‌నుషులైతే ఇండ్లు లేదా బిల్డింగులు లేదంటే చివ‌ర‌కు చిన్న గుడిసె అయినా క‌ట్టుకోవాల‌ని అనుకుంటారు.ఇక జంతువులు అయితే ఏ గుహ‌ల్లోనో లేదంటే ఏ పొదల్లోనో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి.

ఇక ప‌క్షులైతే ఏదో ఒక చెట్టు తొర్ర‌లోనో లేదంటే చెట్ల కొమ్మ‌ల పైనో గూడు క‌ట్టుకోవాల‌ని చూస్తాయి.అయితే ఇందులో చాలా రకాలుంటాయి.

ఇక ఇప్పుడు కూడా మ‌నం ఓ ప‌క్షి త‌న గూడును ఎలా క‌ట్టుకుంటుందో తెలుసుకోబోతున్నాం.

కొన్ని రకాల పక్షులు అయితే ఓ గూడు కట్టుకోవ‌డం కోసం చాలా పెద్ద ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి.

గూడు కోసం గడ్డి పోచలు లేదంటే కొన్ని పుల్ల‌లు లేదంటే చాలా మెత్త‌గా ఉండే పీచులతో త‌మ గూడును ఏర్పాటు చేసుకుంటాయి.ఇక్క‌డ అస‌లు విష‌యం ఏంటేంటే కొన్ని రకాల పిట్ట‌లు అయితే ఓ చిన్న గూడు క‌ట్టుకోవ‌డం కోసం కొన్ని జంతువుల నుంచి వాటి జుట్టును తీసుకొచ్చుకుంటాయ‌ని తెలుస్తోంది.

ఇక బ్ర‌తికున్న జంతువ‌ల నుచే ఆ జుట్టును పీక్కు రావ‌డానికి ట్రై చేస్తుంటాయి.ఈ క్రమంలో జంతువుల ఆగ్రహానికి గురి కావ‌డ‌మో లేదంటే చివ‌ర‌కు చనిపోవడమో జరుగుతోంది.

Telugu Animals, Birds Nest, Birds, Sneaky Birds, Sneakybirds-Latest News - Telug

ఇక ఈ విధంగా ఈ ప‌క్ష‌లు సేక‌రిస్తున్న ఈ చర్యకు ఓ పేరంటూ లేద‌నే చెప్పాలి.అయితే ఇన్ని రోజుల‌కు ఈ పక్షులు చేస్తున్న సాహ‌సాన్ని గుర్తించిన సైంటిస్టులు ఈ ప‌నికి ఓ పదం, మీనింగ్ ఇచ్చేశారంట‌.ఈ అసాధారణమైన ప‌నికి ఏకంగా క్లెప్టోట్రిచి అనే పేరు పెట్టేసి దాన్నే రిజిస్ట‌ర్ చేయించారు.ఈ ప‌దాన్ని గ్రీకు భాష నుంచి తీసుకొచ్చారు.దీనికి అర్థం దొంగిలించడం లేదా జుట్టు అనే రెండు అర్థాలు వ‌చ్చే విధంగా వారు పెట్టారు.ఈ ప‌దం కాస్తా ఈ పక్షుల చేస్తున్న చర్యకు స‌రిగ్గా సరిపోతుందనే భావ‌న‌తోనే ఈ పేరును పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube