కొత్త వీఐ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ ఉచితంగా పొందవచ్చు!

వొడాఫోన్, ఐడియా (వీఐ) ఓ కొత్తగా రెండ రీఛార్జ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.రూ.1699, రూ.2,299.ఈ రెండు రెడ్‌ఎక్స్‌ ఫ్యామిలీ ప్లాన్లతో మల్టీ డివైస్‌ కనెక్షన్‌తోపాటు అన్‌లిమిటెడ్‌ బెనిఫిట్స్‌ను ఉచితంగా పొందవచ్చు.నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైం వీడియో, ఇతర ఓటీటీ యాప్స్‌ యాక్సెస్‌ లభిస్తుంది.ఆ వివరాలు తెలుసుకుందాం.

 With The New Vi Postpaid Recharge Plan Can Get Free Access To Netflix Amazon Pri-TeluguStop.com

వీఐ రూ.1,699 రెడెక్స్‌ ఫ్యామిలీ ప్లాన్‌…

ఈ సరికొత్త వీఐ రూ.1,699 ప్లాన్‌తో నెలరోజులకు వర్తిస్తుంది.ఇది మూడు డివైజ్‌లకు కనెక్ట్‌ చేయవచ్చు.ఈ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌తో అపరిమిత కాల్స్, ఎస్‌టీడీ, నేషనల్‌ రోమింగ్‌ కాల్స్‌ పొందవచ్చు.అన్‌లిమిటెడ్‌ డేటాతోపాటు 3 వేల ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి.ఈ పోస్ట్‌పెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌తో ఏడాదిపాటు అమెజాన్‌ ప్రైం సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

అంతేకాదు వీఐ మూవీస్, టీవీ వీఐపీ, అంతర్జాతీయ, జాతీయ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ల(ఏడాదిలో నాలుగుసార్లు) వెసులుబాటు లభిస్తుంది.వినియోగదారులు ఏడు రోజులపాటు ఫ్రీగా ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్యాక్‌ దాని ఖరీదు రూ.2,999 లభిస్తుంది.

Telugu Sms, Amazon Prime, Amazonprime, Disney Hot, Access, Ideavodafone, Netflix

ఈ ప్లాన్‌తో యూఎస్‌ఏ, కెనడాకు ఐఎస్‌డీ కాల్స్‌కు రూ.0.50 నిమిషానికి వర్తిస్తుంది.యూకేకు రూ.3, ఇలా 14 దేశాలకు ప్రత్యేక ధరల్లో లభిస్తుంది.అయితే కేవలం ప్రైవరీ కనెక్షన్‌కు మాత్రమే అన్నీ ఆఫర్లు వర్తిస్తాయి.ఇతర మెంబర్స్‌కు కేవలం 3 వేల ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ డేటా, కాల్స్‌ మాత్రమే పొందుతారు.

వీఐ రూ.2,299 ప్లాన్‌…

వీఐ అత్యధిక ఖరీదైన ప్లాన్‌ ఇది.ఇందులో కూడా పైన చెప్పిన బెనిఫిట్స్‌ అన్నీ ఉంటాయి.కానీ, ఇందులో 5 మెంబర్స్‌ కనెక్షన్‌ పొందవచ్చు.

ఈ కొత్త ప్లాన్‌ వివరాలు ఇప్పటికే కంపెనీ వెబ్‌సైట్‌లో పొందుపరచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube