రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న హీరోయిన్... ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుందట....

ఒక్కోసారి కొంతమంది హీరోయిన్లు వచ్చీరావడంతోనే మంచి హిట్ ని అందుకున్నప్పటికీ అనుకోని కారణాలవల్ల సినిమా ఇండస్ట్రీ కి దూరమై కెరీర్ని పోగొట్టుకున్న నటీనటులు టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.ఇందులో తెలుగులో ప్రముఖ సినీ దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన “నీ ప్రేమకై” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ “సోనియా అగర్వాల్” కూడా ఈ కోవకే చెందుతుంది.

 7g Rainbow Colony Movie Fame Sonia Aggarwal Is Trying To Bag Heroine Chances, 7g-TeluguStop.com

అయితే నటి సోనియా అగర్వాల్ తెలుగులో నటించింది తక్కువ చిత్రాలలోనే అయినప్పటికీ ఈ అమ్మడికి హీరోయిన్ గా మంచి ఫేమ్ లభించింది.కాగా ఆ మధ్య తెలుగులో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన “7/జి బృందావన్ కాలనీ” అనే చిత్రంతో కుర్రకారు మనసుల్ని కట్టి పడేసింది.

కాగా నటిగా సినిమాల పరంగా మంచి గుర్తింపే తెచ్చుకున్నప్పటికీ తన వైవాహిక జీవితంలో మాత్రం సోనియా అగర్వాల్ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది.కాగా తన కెరీర్లో 7/జి బృందావన్ కాలనీ వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు సెల్వ రాఘవన్ ని 2006 వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో 2010వ సంవత్సరంలో విడాకులు తీసుకుంది.దీంతో అప్పటి నుంచి నటి సోనియా అగర్వాల్ ముంబైలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఒంటరిగా ఉంటోంది.

కాగా ఇటీవలే తన మనసుకి నచ్చిన వరుడు దొరికితే మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనంటూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పష్టం చేసింది.

Telugu Rainbow Colony, Rainbowcolony, Red, Sonia Aggarwal, Soniaaggarwal, Tollyw

అంతేకాకుండా ఈ అమ్మడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించేందుకు బాగానే సన్నాహాలు చేస్తోంది.కాగా తెలుగులో ఆమధ్య ప్రముఖ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన “రెడ్” చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించింది.అయితే ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన సోనియా అగర్వాల్ ప్రస్తుతం తల్లి, అక్క, వదిన పాత్రలలో నటించడానికి సంకోచిస్తుంది.

దీంతో ఇటీవలే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మళ్ళీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ క్రమంలో జిమ్ లో వర్కౌట్లు చేయడమేకాకుండా ప్రత్యేక ఆహార డైట్ ను కూడా పాటిస్తూ బరువు తగ్గింది.

మరి ఈ వెటరన్ బ్యూటీకి దర్శక నిర్మాతలు సినిమా ఆఫర్లు ఇస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube