కూతురుతో చివరి చిత్రం చేయబోతున్న రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సు రీత్యా ఇప్పుడు 80లోకి చేరిపోయాడు.అయితే ఇప్పటికి హీరోగా ఏ మాత్రం జోష్ తగ్గకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు.

 Rajinikanth Next Movie With His Daughter, Super Star, Kollywood, Tollywood, Raji-TeluguStop.com

రీసెంట్ గా శివ దర్శకత్వంలో అన్నాత్తై మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు.దీనిని పూర్తి చేసిన వెంటనే కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్ళిపోయారు.

ప్రస్తుతం అక్కడే రజినీకాంత్ విశ్రాంతి తీసుకుంటున్నారు.అన్నాత్తై సినిమా షూటింగ్ సమయంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అమెరికా వెళ్లి పూర్తిస్థాయిలో టెస్ట్ లు చేసుకుంటున్నారు.

అక్కడి నుంచి వచ్చాక ఇకపై సినిమాలు చేయాలా లేదా అనే విషయంపై రజినీకాంత్ అభిమానులకి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇప్పటికే రజినీకాంత్ సినీ ప్రయాణం ముగించడానికి మొగ్గు చూపిస్తున్నట్లు చూచాయగా అభిమానులకి చెప్పారు.

అయితే ఆయన అనారోగ్య కారణాల వలన ఈ సారి అభిమానుల నుంచి పెద్దగా ఒత్తిడి రాలేదు.ఈ నేపధ్యంలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే రజినీకాంత్ తన చివరి చిత్రాన్ని కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ లో ఒక వర్గం నుంచి వినిపిస్తున్న మాట.గతంలో ఐశ్వర్య రజినీకాంత్ తో కొచ్చడియాన్ అనే యానిమేషన్ మూవీని తెరకెక్కించింది.ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.అయితే తండ్రితో హిట్ సినిమా చేయాలనే ఐశ్వర్య కల అలాగే ఉండిపోయింది.ఈ నేపధ్యంలో కూతురు దర్శకత్వంలోనే చివరి చిత్రం చేసిన సినిమా ప్రస్తానం ముగించాలని రజినీకాంత్ భావిస్తున్నట్లు బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube