మొటిమలు.ఎందరినో బాధించే చర్మ సమస్య ఇది.యుక్త వయసు రాగానే ప్రారంభం అయ్యే ఈ మొటిమలను శాశ్వతంగా వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.కానీ, మొటిమలు ఓ పట్టాన పోనే పోవు.
పైగా ఎన్నో ఇబ్బందులకు కూడా గురి చేస్తుంటాయి.ఇదిలా ఉంటే.
సాధారణంగా మొటిమలు ఒక్కొక్కరికి ఒక్కో చోట వస్తుంటాయి.కొందరికి బుగ్గలపై వస్తే.
కొందరికి గడ్డంపై వస్తాయి.మరికొందరికి మెడపై వస్తుంటాయి.
అలాగే కొందరికీ నుదిటిపై కూడా మొటిమలు వస్తాయి.
అయితే నుదిటిపై మొటిమలు రావడానికి కొన్ని కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.
ముఖ్యంగా నుదిటిపై మొటిమలు వస్తున్నాయి అంటే.వారు మలబద్ధకంతో బాధ పడుతున్నారని అర్థం.
అంతే కాదు, ఎవరైతే నిద్ర లేమి, కాలేయ సంబంధిత జబ్బులు, అధిక ఒత్తిడి సమస్యలతో బాధ పడుతున్నారో.వారికి కూడా నుదిటిపై మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
అలాగే నుదిటిపై మొటిమలు ఏర్పడటానికి చుండ్రు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక ఇప్పటి వరకు నుదిటిపై మొటిమలు రావడానికి కారణం తెలుసుకున్నాం.మరి ఆ మొటిమలను పోగొట్టుకునేందుకు పరిష్కారాలు కూడా తెలుసుకోవాలి కదా.మరి లేటెందుకు అవి కూడా చూసేయండి.
ముందుగా యాపిల్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి.అందులో ఎగ్ వైట్ మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసి నుదిటిపై పూయాలి.
పదిహేను నిమిషాలు డ్రై అవ్వనిచ్చి.అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

అలాగే ఓట్స్‌ను మెత్తగా పొడి చేసుకుని.అందులో చిటికెడు పసుపు మరియు పాలు వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నుదిటిపై అప్లై చేసి.
పది, ఇరవై నిమిషాల తర్వాత కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మొటిమలు మటుమాయం అవుతాయి.
ఈ టిప్స్‌తో పాటు ఆరోగ్యంపై సైతం శ్రద్ధ వహించాలి.