అంతన్నారు.. ఇంతన్నారు ! మోదీ పాలన పై ఇప్పుడేమంటారు ? 

ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాక , ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేసి చూపించిన అభివృద్ధి నమూనాను ఆధారంగా తీసుకుని ప్రధానిగా ఆయనకు అవకాశం కల్పించారు.

 Growing Opposition Among The Masses To The Modi Administration Morning Consultan-TeluguStop.com

మోదీ పరిపాలన తీరుతో ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా భారత్ వెలిగిపోతోందని అంతా నమ్మారు.దీనికి తగ్గట్లుగానే మొదటి విడత ప్రభుత్వంలో ప్రధానిగా పని చేసిన మోదీ దేశ వ్యాప్తంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు ఎన్నో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో,  జనాలు ఆయన ప్రభుత్వాన్ని గెలిపించినందుకు సంతృప్తి చెందారు.

అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వ పాలనపై వ్యతిరేకతకు ఎక్కువ అయినట్లుగా అనేక సందర్భాల్లో రుజువైంది.ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా అవ్వడం, భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం దీనికి తోడు దేశవ్యాప్తంగా పన్నుల భారం,  ధరల పెరుగుదల ఇలా ఎన్నో అంశాలు మోదీ ప్రతిష్టను మసకబార్చాయి.

Telugu Bharath, Central, Gujarath Cm, India, Karona, Modhi, Consultant, Prime-Te

కరోనా కట్టడి లో కేంద్రం విఫలమైందనే విమర్శలు మూటగట్టుకున్నారు.అసలు ప్రధానిగా నరేంద్ర మోదీ పూర్తిగా విఫలమయ్యారని , రాబోయే ఎన్నికల్లో మరొకరిని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందనే ప్రచారం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.అంతగా మోదీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.దేశవ్యాప్తంగా ను జనాల్లో ఇదే అభిప్రాయము ఉంది .అయితే అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ మాత్రం ప్రపంచ స్థాయి లో పాపులర్ నాయకుడిగా మోదీ అగ్రస్థానంలో ఉన్నట్లుగా ఉన్నట్లు ప్రకటించింది.ఈ విషయాన్ని బిజెపి గొప్పగా ప్రచారం చేసుకుంటోంది.

అయితే ఆ సర్వే ప్రామాణికంగా చూసుకుంటే,  ప్రపంచవ్యాప్తంగా మోదీ పరిపాలన ను జనాలు మెచ్చుకుంటున్నారా ? అందులో ఎంత వాస్తవం ఉంది అనేది చూసుకుంటే చాలా అంశాలు బయటకు వస్తున్నాయి.

అసలు ఆ కన్సల్టెంట్ సంస్థ సర్వే కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ట్రాకింగ్ సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది.పాక్షికత కు తావులేని సాధికారికమైన శాంపిల్ ను మాత్రమే తెప్పించుకుంటూ ఉంటుంది.

దీంతో ఈ సంస్థ పై ప్రపంచ వ్యాప్తంగా అందరికీ నమ్మకం ఉంది.ఈ సర్వే రిజల్ట్ బిజెపికి కాస్త ఉత్సాహాన్ని కలిగించింది.

అయితే మన దేశంలో మోదీ పరిపాలన పై అంత సంతృప్తి ఉందా అంటే లేదనే చెప్పాలి.అసలు కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్థ రిపోర్ట్ అంతగా సంతృప్తి కలిగించలేదు.

దీనికి కారణం ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉందనే విషయం కేంద్రం ఇప్పటికే గుర్తించింది.మొదట్లో మోదీ పరిపాలన బ్రహ్మాండం అన్నవారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

దీనికి కారణం దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందన్న విషయం జనాల వరకూ వెళ్ళిపోవడమే. బ్రహ్మాండం అన్నావారూ ఇప్పుడు ఫర్వాలేదు అంటూ నిట్టూర్చే అంతగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube