లాక్ డౌన్ పై కీలక కామెంట్ చేసిన ఢిల్లీ సీఎం..!!

దేశంలో మొదటి నుండి దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత అధికంగా ఉందన్న సంగతి తెలిసిందే.మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు, మరణాలు ఢిల్లీలో చోటుచేసుకోవడం తో అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వం గత కొంతకాలం నుండి లాక్ డౌన్ అమలు లోకి తీసుకు రావడం తెలిసిందే.

 Delhi Cm Kejriwall Sensational Comments On Delhi Lock Down , Kejriwall, Delhi Lo-TeluguStop.com

ఏప్రిల్ రెండో వారం నుండి ఢిల్లీలో లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం అంతకుముందు నైట్ కర్ఫ్యూ విధిస్తూ వచ్చింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీలో కేసులు తగ్గుముఖం పడుతూ ఉండటంతో పాటు మృతుల సంఖ్య కూడా తగ్గటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సత్ఫలితాలు బట్టి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ నెల 31 వ తారీకు నుంచి దశలవారీగా అన్‌లాక్‌ ప్రక్రియ రాష్ట్రంలో అమలు చేయాలని డిసైడ్ అయ్యింది.ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేజ్రీవాల్ తెలియజేశారు.31 వ తారీకు నుంచి దశలవారీగా అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించిన గాని కరోనాతో పోరాటం తప్పదని స్పష్టం చేశారు.అదేరీతిలో వలస కార్మికులకు మరియు కూలీలకు అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.అదే రీతిలో ఫ్యాక్టరీలు తిరిగి కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube