కార్తీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

యుగానికి ఒక్కడు అనే డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కార్తీ సుపరిచితమయ్యారు.తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న కార్తీ ఆ సినిమా తరువాత నా పేరు శివ, ఆవారా సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

 Interesting Facts About Star Hero Surya Brother Hero Karthi, Karthi, Surya Broth-TeluguStop.com

సూర్య తమ్ముడిగా కార్తీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తక్కువ సమయంలోనే కార్తీ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచుకున్నారు.తమిళ హీరో అయినప్పటికీ కార్తీ తెలుగు హీరోలకు సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.

ఏప్రిల్ తొలివారంలో రిలీజైన కార్తీ సుల్తాన్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.కార్తీ అసలు పేరు కార్తీక్ శివకుమార్.1977 సంవత్సరం మే 25వ తేదిన కార్తీ జన్మించారు.కథల ఎంపికలో కార్తీ అన్న కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు.

తెలుగులో డబ్బింగ్ అయ్యే సినిమాకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటారు.పరుత్తివీరన్ సినిమాతో నటుడిగా కార్తీ కెరీర్ ను మొదలుపెట్టారు.

సినిమాల్లోకి నటుడిగా ఎంట్రీ ఇవ్వకముందే కార్తీ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.తెలుగులో అన్నను మించి ఈ హీరో పాపులారిటీని సంపాదించుకున్నారు.కార్తీ తండ్రి శివకుమార్ తమిళనాడులో నటుడిగా ఎంతో మంచి పేరును సొంతం చేసుకున్నారు.

Telugu Assistant, Karthi, Latest, Maniratnam, Mechanical, Sulthan, Surya Brother

కార్తీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఆ తరువాత అమెరికాలో ఎమ్.ఎస్ చేశారు.అప్పట్లో లావుగా ఉన్న కార్తీ తరువాత కాలంలో బరువు తగ్గారు.

ప్రస్తుతం కార్తీ మణిరత్నం నిర్మాతగా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఇది కాక కార్తీ చేతిలో సర్దార్ అనే సినిమా ఉంది.నిన్న కార్తీ పుట్టినరోజు కాగా కార్తీ అభిమానులకు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవద్దని కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులకు సూచనలు చేయడం గమనార్హం.పరిమిత బడ్జెట్ తోనే కార్తీ సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube