ఇండియాలో సోషల్ మీడియా సంస్థలు చాలా వరకు కేంద్రం నిబంధనలకు లోబడి వ్యవహరించడం లేదని.వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ డేటా చౌర్యంకు పాల్పడుతూ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేస్తున్నారు అంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
మూడు నెలల క్రితం దేశ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా సంస్థలు అన్నింటికి కూడా కేంద్రం గైడ్ లైన్స్ ను విడుదల చేసింది.ఆ గైడ్ లైన్స్ కు ఇప్పటి వరకు ట్విట్టర్, ఫేస్ బుక్ మరియు ఇన్ స్టాగ్రామ్ సహా ఇతర సంస్థలు ఏవీ కూడా ఓకే చెబుతూ తమ ఒప్పందంను కేంద్రంకు ఇవ్వలేదు.
కేంద్రం ఆ సోషల్ మీడియా సంస్థలకు ఇచ్చిన అవకాశం రేపటితో ముగియబోతుంది.దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చైనా యాప్స్ ను ఎలా అయితే బ్యాన్ చేశారో అలాగే ఆ సోషల్ మీడియా యాప్స్ ను కూడా బ్యాన్ చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.ఈ సమయంలో ప్రముఖులు కొందరు ట్విట్టర్ తో పాటు పలు సోషల్ మీడియా సంస్థలకు మద్దతుగా నిలుస్తున్నాయి.
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో పాటు దేశంలోని పలువురు సినీ ప్రముఖులు కూడా ట్విట్టర్ కు తన మద్దతు అంటూ హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేస్తున్నారు.ట్విట్టర్ లో ఉన్న సెక్యూరిటీ లోపాలు ఏంటీ అంటూ వారు కేంద్రంను ప్రశ్నిస్తున్నారు.
యూజర్స్ వ్యక్తిగత డేటాను కేంద్రంకు ఇవ్వకూడదు అనే ట్విట్టర్ నిర్ణయాన్ని అంతా సమర్థిస్తున్నారు.కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క సోషల్ మీడియా ప్లాట్ పామ్ ను కూడా నిలిపి వేయవద్దంటూ జనాలు హెచ్చరిస్తున్నారు.
మోడీ ప్రభుత్వం ఇప్పటికే పలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంది.ఈ విషయంలో కూడా వారు తీసుకుంటున్న నిర్ణయం ఏమాత్రం సబబు గా లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరి రేపు ఏం జరుగుతుంది అనేది అందరికి ఆసక్తిని రేకెత్తిస్తుంది.ఒక వేళ ఫేస్ బుక్ ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ లు పోతే పరిస్థితి ఏంటో ఒక సారి ఊహించుకుంటేనే పరిస్థితి భయంకరంగా అనిపిస్తుంది కదా.!
.