తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేశారు.ఇప్పటికే కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ లు అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటివరకు 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ అందించగా త్వరలో 18 నుండి 44 ఏళ్ల వయసు గల వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ అందిస్తారని తెలుస్తుంది.ఈ క్రమంలో కొందరిని సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించి స్పెషల్ డ్రైవ్ గా కొందరికి ముందుగా వ్యాకిన్ వేయించాలని ఆదేశించారు తెలంగాణా సిఎం కే.
సి.ఆర్.
సూపర్ స్ప్రెడర్స్ గా ఉన్న కూరగాయల వ్యాపారులు, ఆర్టీసి కండక్టర్లు, డ్రైవర్లు, డెలివెరీ బోయ్స్, సేల్స్ మెన్లను గుర్తించి వారందరికి టీకాలను అందచేయాలని నిర్ణయించారు.జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఈ స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలని కే.సి.ఆర్ ఆదేశించారు.అంతేకాదు అన్ని జిల్లాలకు వెళ్లి అక్కడి పరిష్తితులను పరిశీలించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు.ప్రస్తుతం తెలంగాణాలో లాక్ డౌన్ కొనసాగుతుంది.మే 30 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా నడిపిస్తున్నారు.ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఇవ్వగా.10 దాటిన తర్వాత లాక్ డౌన్ ను కఠినతరం చేస్తున్నారు. అత్యవసర పని కాకుండా లాక్ డౌన్ టైం లో సరదాగా బయటకు వస్తే మాత్రం వాహనాలను సీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.