మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది.కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.
సినిమా విడుదల నిలిచి పోయింది.కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది స్టార్ హీరోల చిన్న హీరోల సినిమా లు కూడా నిలిచి పోయాయి.
కొత్త గా మరి కొన్ని సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.దాంతో సినిమాల వెయిటింగ్ లిస్ట్ పెరుగుతూనే ఉంది.
ఎప్పటి వరకు పరిస్థితులు కుదుట పడుతాయో తెలియని పరిస్థితి.ఇలాంటి నేపథ్యంలో ఆచార్య సినిమా కొత్త విడుదల తేదీ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటే ఇప్పటికే సంక్రాంతిపై చాలా సినిమాలు కర్ఛిఫ్ లు వేసి ఉంచారు.కనుక ముందే రావాలని మెగా స్టార్ నిర్ణయించుకున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో సినిమా షూటింగ్ కు వీలు కలిగితే రెండు వారాల గ్యాప్ లోనే షూటింగ్ ను ముగించేయాలని భావిస్తున్నారు.ఆ వెంటనే సినిమా విడుదల తేదీ పై కూడా స్పష్టత ఇవ్వబోతున్నారు.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొత్త విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు.పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టులో సినిమాను విడుదల చేయబోతున్నారు లేదంటే దసరాకు సినిమాను పక్కాగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
జనవరి ఫిబ్రవరిలో మాదిరిగా కరోనా కాస్త ఉపశమనం కలిగించినా కూడా వెంటనే ఆచార్య సినిమాను విడుదల చేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు.రామ్ చరణ్ కూడా ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే గెస్ట్ గా కనిపించబోతుంది.ఇక సంగీత ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.