ఆ రాష్ట్రంలో ఫ్యాన్స్ సన్నీ లియోన్ కి ఏకంగా కటౌట్ పెట్టేశారు

శృంగార చిత్రాలతో కెరియర్ ప్రారంభించి తరువాత హిందీ బిగ్ బాస్ లో అడుగుపెట్టి అక్కడి నుంచి బాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రయాణం మొదలు పెట్టిన పంజాబీ భామ సన్నీ లియోన్.ఈ అమ్మడు బాలీవుడ్ లో చాలా వరకు అడల్ట్ కంటెంట్ సినిమాలనే చేసింది.

 Sunny Leone Cutout In The Village Of Karnataka, Bollywood, Tollywood, Bollywood-TeluguStop.com

అయితే తరువాత మెల్లగా ఆ జోనర్ నుంచి బయటకొచ్చి ఇతర బాషలలో కూడా సినిమాలు చేస్తూ నటిగా, ఐటెం సాంగ్స్ ద్వారా మంచి డాన్సర్ గా ప్రూవ్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే ఈమె తెరపై ఎలాంటి పాత్రలు చేసిన నిజ జీవితంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పాలి.

అనాధ పిల్లలని దత్తత తీసుకొని తన సొంత బిడ్డలుగా పెంచుతుంది.అలాగే ఎవరైనా కష్టంలో ఉన్నారు అని తెలిస్తే వెంటనే సాయం చేయడానికి ముందుకొస్తుంది.

కరోనా కష్టకాలం లో కూడా వీధులలో అడుక్కునే వారికి ఆహారం పంపిణీ చేయడం ద్వారా పెద్ద మనసు చాటుకుంది.ఈ నేపధ్యంలో ఆమెని శృంగార తారగా చూసిన వారు తరువాత సన్నీ లియోన్ లోని హ్యూమనిటీ యాంగిల్ చూసి ఫాన్స్ అయిపోయారు.

కేరళ, కర్నాటక రాష్ట్రాలలో ఆమెకి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సన్నీ లియోన్ పుట్టిన రోజు సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో మాండ్యా జిల్లా కొమ్మేరహళ్లి గ్రామంలో అభిమానులు ఏకంగా కటౌట్ పెట్టేశారు.

హ్యాపీ బర్త్ డే సన్నీ లియోన్.అనాథ పిల్లలకి తల్లి, అభిమానులకి దేవత అంటూ ఆ కటౌట్ మీద రాసి గ్రామం ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేశారు.

ఈ కటౌట్ ని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.మరి ఈ కటౌట్ పై సన్నీ లియోన్ ఎలా రియాక్ట్ అవుతుందో అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube