మరో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన అందాల భామ తమన్నా బాటియా.ఈ అమ్మడు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరితో ఇంచుమించు నటించింది.

 Tamannaah Green Signal To One More Web Series, Tollywood, Bollywood, Seeti Maar-TeluguStop.com

నటిగా, అలాగే బెస్ట్ డాన్సర్ గా తనదైన ముద్ర వేసుకున్న తమన్నా ప్రస్తుతం నితిన్ మ్యాస్ట్రో సినిమాతో నెగిటివ్ రోల్ లో కూడా మెప్పించడానికి రెడీ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

మరో వైపు వెంకటేష్ కి జోడీగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్3 మూవీలో కూడా నటిస్తుంది.అలాగే సత్యదేవ్ కి జోడీగా గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తుంది.

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ కి జోడీగా నటించిన సిటీమార్ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు చేస్తూనే రీసెంట్ గా తమన్నా డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 11 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.ప్రస్తుతం ఈమె నటించిన రెండో వెబ్ సిరీస్ నవంబర్ స్టొరీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది.

మే 20 నుంచి ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ కానుంది.ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ వెబ్ సిరీస్ కి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.

క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ లో తమన్నా మొదటి సారి పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube