కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజలకు మళ్లీ ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి, సంపన్నులకు ఎటువంటి సమస్య లేకపోయినా సామాన్య ప్రజలు, పేద ప్రజలు, చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.
అయితే ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే సెలబ్రిటీలలో కొందరు ఎటువంటి సహాయం చేయకుండా ఇంటికే పరిమితమవుతుంటే మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ వంతు సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
శృంగార తారగా పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ పెటా ఇండియాతో కలిసి పదివేల మందికి భోజనాలను అందించారు.
గొప్పమనస్సు చాటుకున్న సన్నీలియోన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.సెకండ వేవ్ వల్ల వలస కార్మికులు ఆకలి కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో సన్నీలియోన్ ముందుకు వచ్చి వారికి శాకాహార భోజనాన్ని అందించారు.
సన్నీలియోన్ వలస కార్మికులకు సాయం చేయడం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మనం ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఆమె అన్నారు.

ప్రస్తుత కాలంలో కరుణతో ముందుకు నడవాలని ఆమె వెల్లడించారు.పెటా ఇండియాతో తాను కలిసి పని చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆమె అన్నారు.వలస కార్మికులకు ప్రస్తుత పరిస్థితులో ప్రోటీన్ తో కూడిన ఆహారం ఎంతో అవసరమని అలాంటి ఆహారన్ని వలస కార్మికులకు అందిస్తున్నామని ఆమె తెలిపారు.
ప్రస్తుతం సన్నీ లియోన్ జిస్మ్2 సినిమాలో నటిస్తుండగా ఆమె చేతిలో మరికొన్ని సినిమా ఆఫర్లు ఉన్నాయి.
సన్నీ లియోన్ ఇతర భాషల్లో ఆఫర్లతో కూడా బిజీ అవుతుండటం గమనార్హం.హిందీతో పాటు తెలుగు, మలయాళం ఇండస్ట్రీలలో కూడా సన్నీలియోన్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలైనా సన్నీలియోన్ కు ఆఫర్లు తగ్గకపోవడం గమనార్హం.