టీటీడీ కీలక నిర్ణయం.. గోవిందరాజ స్వామి ఆలయం దర్శన సమయాల్లో మార్పులు.. !

కరోనా దెబ్బకు దేశంలో గానీ ప్రజల జీవితాల్లో గానీ ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి.అదీగాక భక్తులతో కిటకిటలాడే ఆలయాలు భక్తులు లేక వెలవెల పోతున్నాయి.

 Changes In The Visiting Timings Of Tirupati Govindaraja Swamy Temple , Thirumala-TeluguStop.com

ఒకప్పుడు దర్శనాల కోసం రోజుల తరబడి ఎదురు చూసే ఆలయాలను కూడా ప్రస్తుత పరిస్దితుల్లో దర్శించుకోవాలంటే జనం జంకుతున్నారు.

ఇక తిరుమల తిరుపతి స్వామి వారి దర్శనం అంటే ఒక నెల రోజుల నుండి ప్రణాళికలు వేసుకోవాలి.

కానీ ఇప్పుడు ఇవేవి అక్కర్లేదు.అంతా కోవిడ్ మహిమ.

ఎక్కడి వారికి అక్కడే కదలకుండా, ఇంట్లో ఉండేలా చేసింది.ఇదిలా ఉండగా కరోనా వల్ల పలు ఆలయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలో మే ఒకటో తేదీ నుంచి తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో కూడా దర్శన సమయా ల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ స్పెషల్‌ గ్రేడ్‌ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు.ఆ వివరాలు చూస్తే.

ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవను, 6.30 గంటలకు తోమాల సేవ, సహస్రనామార్చన సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు.కాగా ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు, 9.30 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని, సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయ దర్శనానికి అనుమతి ఉండదని పేర్కొంటున్నారు.

ఇక రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.ఇక కరోనా నేపధ్యంలో గోవింద రాజస్వామి ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాల్లో భక్తులకు దర్శనాలను రద్దు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube