పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.మొత్తం ఎనిమిది దశల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్షన్ జరుగుతుండగా ఇప్పటివరకు ఏడు దశల్లో పోలింగ్ పూర్తి కావడం జరిగింది.
దీంతో 259 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది.నేడు జరుగుతున్న ఎనిమిదో దశ పోలింగ్.
మొత్తం 35 నియోజకవర్గాలకు జరుగుతూ ఉంది.ఈ క్రమంలో 283 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్.నేటితో బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్న క్రమంలో మే రెండవ తారీకున ఫలితాలు వెలువడుతున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తత భయంకరంగా ఉండటంతో పోలింగ్ కేంద్రాలలో కరోనా నిబంధనలను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికలలో చాలా పార్టీలు పాల్గొనగా ప్రధాన పోటి తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీ కి మధ్య ఉంది అని సర్వే లు వెల్లడి చేశాయి.
దీంతో ఈ రెండు పార్టీల లో ఏది గెలుస్తుంది అన్నది ఉత్కంఠభరితంగా మారింది.