ప్రస్తుతం మనుషుల ప్రాణాలు ఏ రూపంలో పోతాయో చెప్పడం కష్టంగా మారింది.ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటే గానీ బ్రతికి బట్టకట్టి బయటపడే పరిస్దితులు కనిపించడం లేదు.
ఇక పిల్లల విషయంలో అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటే గానీ వారు బ్రతికేలా లేరు.ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నాకూడా ఏదో ఒక రూపంలో కోడిపిల్లలను గద్ద తన్నుకు పోయినట్లుగా మృత్యువు పసి వారి ప్రాణాలు తీస్తుంది.
ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.ఆ వివరాలు తెలుసుకుంటే తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ అదిగత్తూరు గ్రామానికి చెందిన వినాయగం, నిషాంతి దంపతులకు కుమారుడు అవినాష్(7) అనే బాలుడిని వాటర్ హీటర్ బలి తీసుకుంది.
స్నానానికని వేడి చేసుకుంటున్న వాటర్ హీటర్ బకెట్లో అవినాష్ అడుకుంటూ వెళ్లి, చేయి పెట్టడంతో విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడట.వెంటనే బాలున్ని చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు చూశారా తల్లిదండ్రులు ఒక చిన్న నిర్లక్ష్యం పిల్లల పాలిట శాపంగా మారుతుందో.
అందుకే పిల్లలను కనడమే కాదు వారిని పెంచడంలో కూడా శ్రద్ధ పెట్టాలని ఈ ఘటన నిరూపిస్తుంది.