జగన్ మొండి పట్టు ..అదే లోకేష్ ఆయుధం ?

తమపై విమర్శలు చేసే అవకాశం తమ రాజకీయ ప్రత్యర్ధులకు ఇవ్వకుండా,  జగన్ చాలా జాగ్రత్త పడుతూనే వస్తున్నారు.ఏ విషయంలోనూ ప్రతిపక్షాలకు దొరక్కుండా జాగ్రత్త పడుతూ ఉండడం తో,  ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సరైన అవకాశాలు దొరక్క టిడిపి వంటి పార్టీలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయి.

 Nara Lokesh Criticizes Jagan Over Cancellation Of Tenth Exams ,lokesh Criticizes-TeluguStop.com

అందుకే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలలోని సూక్ష్మ లోపాలను సైతం వెతికి మరీ విమర్శలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా బాగా యాక్టివ్ అయ్యారు.

ఏదో ఒక కారణంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.అయినా ఆ విమర్శలు జనాల్లోకి పెద్దగా వెళ్లడం లేదు.

దీనికి కారణం బలమైన పాయింట్ ఏది దొరకక పోవడమే.అయితే ఇప్పుడు ఆ బలమైన పాయింట్ లోకేష్ కు దొరికేసింది.

ఏపీలో కరోనా ఉధృతం అవుతున్న నేపథ్యంలో, ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చేశారు.కానీ పదో తరగతి పరీక్షల విషయంలో మాత్రం ప్రభుత్వం ఈ మినహాయింపు ఇవ్వలేదు.

యథావిధిగా పాఠశాలలు నడుస్తున్నాయి.కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఈ విధంగా పాఠశాల తెరుచుకోవడం వల్ల విద్యార్థులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ లోకేష్  వాదిస్తున్నారు.

ఈ విషయంపై ఆయన గత కొద్ది రోజులుగా ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.అలాగే ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.అది దాటిపోవడంతో ఆందోళన నిర్వహించారు.అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ తీరును ఎండగడుతూ పరీక్షల రద్దుకు ఆన్లైన్ ద్వారా ఉద్యమం చేపట్టేందుకు లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి యువ నేతలంతా సిద్ధం అయిపోయారు .ఈ మేరకు మీటింగ్ సైతం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.వాస్తవంగా  ప్రభుత్వం సైతం పదో తరగతి పరీక్షలన రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది.

కానీ ఈ లోపు లోకేష్ ఈ ఉద్యమాన్ని తలకెత్తుకోవడం తో ఇప్పుడు పరీక్షలను రద్దు చేస్తే ఆ క్రెడిట్ అంతా లోకేష్ కు  వెళ్ళిపోతుందని జగన్ వెనకడుగు వేస్తున్నారు.

Telugu Ap, Carona, Corona Wave, Covid, Jagan, Lock, Lokesh Deadline, Lokesh Dedl

  ఈనెల 29వ తేదీన విద్యాశాఖ పై జగన్ సమీక్ష చేయబోతున్నారు.ఈ సందర్భంగా పరీక్షల రద్దుపై ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.  అయితే ఈ లోపుగానే హైకోర్టులో పిటిషన్ వేసి ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి యువ నేతలంతా భావిస్తున్నారు.

మొత్తం జగన్ తన పై పోరాటం చేసేందుకు లోకేష్ తో పాటు,  టిడిపి యువ నాయకులు అందరికీ అవకాశం కల్పించినట్లు కనిపిస్తుంది.అసలు ఈ పరీక్షలు రద్దు చేస్తారని అందరికీ తెలుసు.

  కాకపోతే కాస్త ఆలస్యంగా ఈ నిర్ణయం వెలువడుతుంది.ఈ సమయంలో దానిని క్యాష్ చేసుకుని తమకు అనుకూలంగా మార్చుకోవడం లో టీడీపీ, లోకేష్ సక్సెస్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube